వంశీకి ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని

ఏపీలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని రాజకీయంగా అగ్గి రాజేశారు.. టీడీపీ పై పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు, అయితే ఇదే సమయంలో మరో అంశం కూడా ఆయన రాజీనామా గురించి తెరపైకి వచ్చింది, తాజాగా దీనిపై ఏపీ స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలెవరైనా అనర్హత వేటు ఎదుర్కోక తప్పదని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీకూడా అందుకే వెయిట్ చేస్తోంది, రాజీనామా చేయకుండా వంశీని పార్టీలో చేర్చుకుంటే ఈ ఐదు సంవత్సరాలు జగన్ టీడీపీకి అడ్డంగా ఇరుక్కుంటారు. అందుకే వంశీ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరుతారు అని తెలుస్తోంది.

అందరితో పాటు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకైనా ఇదే షరతు వర్తిస్తుందని చెప్పారు స్పీకర్.. దీంతో వంశీ పక్కాగా రాజీనామా చేస్తారు అని అంటున్నారు. తమ హయాంలో అనైతిక రాజకీయాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి ఎవరొచ్చినా రాజీనామా చేసే రావాలని సీఎం, సభానాయకుడు జగన్ స్పష్టం చేశారని తెలిపారు ఆయన. నాది కూడా అదే వైఖరి అని తెలియచేశారు. వల్లభనేని వంశీ అయినా రాజీనామా చేయకుండా పార్టీ మారితే అనర్హత వేటు తప్పదు అని తెలియచేయడంతో , పార్టీలకు సంబంధం లేకుండా ఎవరికి అయినా స్పీకర్ తన అధికారాలతో చర్యలు తీసుకుంటారు అనేది ఆయన చెప్పకనే చెప్పారు.

ఒకవేళ వంశీని టీడీపీ బహిష్కరిస్తే.. ఆయనకు స్వతంత్రత లభిస్తుందన్నారు. సభా కార్యకలాపాల నిర్వహణపై సీఎం తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోమన్నారని తెలిపారు. ఏది ఏమైనా పార్టీ ఫిరాయింపుల వల్ల రాజకీయంగా విలువలు కోల్పోతున్నామని, వీటినెవరూ ప్రోత్సహించకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని.. చెప్పారు. ఇక ఎలాంటి విమర్శలు ఆరోపణలు టెక్నికల్ విషయాలలో రాకుండా, వంశీ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారు అని తెలుస్తోంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.