janampulse

తమలపాకు తింటే కలిగే 10 లాభాలు ఇవే

These are the 10 benefits of eating Tamalapaku

మనంచాలా సమయాల్లో పూజలు చేస్తే వెంటనే అక్కడ పూలు పళ్లు తమలపాకులు చూస్తు ఉంటాము.. ఎప్పటి నుంచో పూజల్లో తాంబూలం ఇవ్వడం ఆనవాయితీగా చూస్తాం… . మన హిందూ సంప్రదాయాంలో ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది…. ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం చేస్తాం… అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని పూజిస్తాం.
అలాగే తమలపాకుకి కూడా ఓ విశిష్టత ఉంది అని చెబుతున్నారు. అంతేకాదు ఆయర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఆంజనేయస్వామికి తమలపాకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు …వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు. అయితే ఇది శరీరానికి చాలా మంచి చేస్తుందట.

శరీరానికి తాంబూలం తీసుకుని తింటే చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.అందుకే వారానికి రెండు తమలపాకులు తీసుకున్నా మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో పీచు పదార్ధం చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే జీర్ణం అవుతాయి. సున్నంవక్క కాకుండా ఉత్తి తమళపాకు తింటే చాలా మేలు అని చెబుతున్నారు వైద్యులు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.