
పాదయాత్రలో జగన్ కొత్త అస్త్రాలు ఇవే ?
మహానేత.. దివంగత నేత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ ఆరు నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్నారు.. సుమారు పాదయాత్ర ద్వారా జగన్ మూడు వేల కిలోమీటర్లు పర్యటించనున్నారు.. ఇడుపులపాయనుంచి ఇచ్చాపురం వరకూ మూడువేల కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర, 13 జిల్లాలమీదుగా సాగనుంది..పాదయాత్రలో సుమారు 2 కోట్ల మందిని జగన్ కలుసుకోనున్నారు..ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పాదయాత్రలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా జగన్ చేయనున్నారు..అలాగే పలు కీలక నిర్ణయాలు వైసీపీ శ్రేణులకు.. వైసీపీ విస్తృత స్ధాయి భేటీలో జగన్ వెల్లడించారు..
1..జగన్ పాదయాత్రకు ప్రజాసంకల్పం అనే పేరును పెట్టారు
2… నవంబర్ 6 నుంచి మొదలై దాదాపు ఆరు నెలల పాటు జగన్ పాదయాత్ర కొనసాగనుంది.
3..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు జగన్
4… పాదయాత్ర ద్వారా 45 లక్షల కుటుంబాల్లో, సుమారు 2కోట్లమందిని వైఎస్ జగన్ కలుస్తారు.
5…పాదయాత్రలో 20వేలమందికి పైగా కార్యకర్తలతో భేటీ అవుతారు.
6.. పాదయాత్ర లో 10 వేల గ్రామాల్లో జనంతో మమేకం అవుతారు జగన్.
7…. అలాగే జగన్ బస్సుయాత్ర చేపట్టనున్నారు
8…. పాదయాత్ర చేయలేని 50 నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర చేయనున్నారు.
9….దాదాపు 5వేలకు పైగా దారి వెంబడి 125 రోజులు రచ్చబండ కార్యక్రమాలు ఉంటాయి.
10.. ప్రజల వద్ద నుంచి,రచ్చబండలో ప్రత్యేక హోదా కోరుతూ సంతకాల సేకరణ ఉంటుంది.
11..మొదట నాలుగు నెలల్లో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు జరపనున్నారు.
12.. ప్రతీపల్లెలో ప్రజా అవసరాలపై పల్లెలో మీటింగులు సమావేశాలు నిర్వహించనున్నారు.
13..నవంబర్ ఆరవ తేది ఉదయం 11 గంటలకు వైయస్ జగన్ పాదయత్ర మొదలు కానుంది.
14…జగన్ పాదయాత్రలో ఆయన వెంట పలువురు జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు ఉంటారు.
15 …ఇక వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్