janampulse
Breaking News

చంద్రబాబు పై జగన్ టార్గెట్ ఈ ఐదు అంశాలు

These five items are Jagan Target on Chandrababu

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వెయ్యకూడదు చంద్రబాబు ఐదు సంవత్సరాలు గా జగన్ అవినీతి పరుడు, ఆర్దిక ఉగ్రవాది ఇలా అనేక కామెంట్లు చేశారు..జనాలు తింగరోళ్లు కాదు, ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడానికి అనేది తేలిపోయింది .ప్రజలు మాత్రం నమ్మలేదు చంద్రబాబు వ్యాఖ్యలు విమర్శలు ఆరోపణలు.. జగన్ ఎలాంటి తప్పు చేయలేదు అని నిజంగా నమ్మకపోయి ఉంటే ఇంత భారీ విక్టరీ రాదు, పైగా బాబు రాజకీయం కూడా మారిపోయింది. సొంత డెసిషన్లు అలాగే పక్కన నేతల ఆలోచనలు వెరసీ బాబు తీసుకున్న నిర్ణయాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అలాగే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ప్రత్యేక హోదా పై యూటర్న్ తీసుకుంది. ఇవన్నీ కూడా బాబుకు ఈ ఎన్నికల్లో ఓటమికి కారణం అయ్యాయి. ఇక ప్రత్యేకంగా చెప్పింది చేయాల్సిందే కాని ఎన్నికల మేనిఫెస్టోలో ఏ హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు. అందుకే ప్రజలు కూడా ఛీదరించుకున్నారు అనేది ఈ ఎన్నికల ఫలితాలలో తేలిపోయింది.

అయితే ఇప్పటికైనా మరో ఐదు సంవత్సరాలు కచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన సమయం. అందుకే బాబులో మార్పు వస్తోందట. ఇప్పటికే కరకట్ట దగ్గర నిర్మించిన ప్రజావేదిక కూల్చేశారు.దీనిపై ఎంత నానాయాగీ చేసినా అది అక్రమ కట్టడం సో ప్రజలు కూడా పెద్ద బాధపడలేదు. అందరికి న్యాయం ఒకేలా ఉండాలి అనేది వారు చెప్పేమాట. ఇక జగన్ ఇప్పుడు బాబు ఇంటిపై కూడా ఫోకస్ చేశారు, అది కూడా అక్రమ కట్టడమే సో అది కూడా రోపో మాపో కూల్చేయడం పక్కా అనేది టాక్.

మరి బాబు అందుకే అద్దె ఇంటికి మారాలి అని చూస్తున్నారు. ఇక అద్దె ఇంటికోసం నేతలు వెతుకులాట చేస్తున్నారు. ఇక జగన్ ని తక్కువ అంచనా వేయకూడదు అనేది బాగా తెలిసి వచ్చింది చంద్రబాబుకి, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అన్నా అసెంబ్లీలో ఎలాంటి పరిస్దితి బాబుకు వచ్చిందో స్పష్టంగా కనిపించింది. గంటా అచ్చెన్నాయుడు రామానాయుడు మినహా పార్టీ తరపున వాయిస్ వినిపించే వారు ఎవరూ లేరు అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక పయ్యావుల కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీ వాయిస్ వినిపిస్తారు అని, ఆ పార్టీ నేతల ఆలోచన. మరి కేవలం 23 మంది మాత్రమే తమ వైపు ఉన్నారు. ప్రభుత్వం తమని గుర్తించడం లేదు అని ప్రజల్లోకి వెళ్లినా ప్రజలు కూడా తిరగబడే ప్రమాదం ఉంది. పోని సాధారణంగా ఉందాం అన్నా తెలుగుదేశం పార్టీ పరిస్దితి ఆగమ్యగోచరంగా మారింది. ఇది బాబుకు మరింత తలనొప్పి తెప్పిస్తున్న అంశం. ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు జగన్ ని అవమానించారు. కాని జగన్ మాత్రం తొలి సమావేశంలోనే బాబుకు వైసీపీ విమర్శల దాడి చూపించారు.

రాజకీయంగా చంద్రబాబు ఎంతసేపు తనకు ఇండస్ట్రీలో 40 ఏళ్ళ అనుభవమని, దేశం మొత్తం మీద తానే సీనియర్ రాజకీయ నేతనని తన భుజాన్ని తానే చరుచుకోవటంతోనే సరిపోయింది.దీనికి బాకాలు పలికే మీడియాచ వత్తాసు పలికే నేతలతో బాబు అడ్డంగా మునిగిపోయారు. అందుకే ఇక నేతలను మీడియాని కాకుండా ప్రజలను నమ్మాలి అని చూస్తున్నారు బాబు. ఈ మార్పుకి కారణం మాత్రం కచ్చితంగా జగన్ అని అంటున్నారు కొందరు నేతలు.. కచ్చితంగా జగన్ ఏదో ఓ అంశంలో దొరుకుతారు అని ఆ విషయం పై గట్టిగా ప్రశ్నించాలి అని బాబు ఎదురుచూస్తున్నారట? కాని జగన్ ఆ అవకాశం ఇవ్వను అంటున్నారు.

గత ప్రభుత్వం హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన ఒప్పందాలు ,రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి అన్నింటిని జగన్, ఆ తుట్టలను కెలుకుతున్నారు. మరి జగన్ ఏ అంశంలో దొరుకుతారో తెలియదు కాని, ఈ ఐదు సంవత్సరాల అవినీతిలో బాబు మెడకు చుట్టుకునేవి చాలా ఉన్నాయి అని కౌంటర్ కూడా వేస్తున్నారు వైసీపీ నేతలు. చూడాలి ఇరువురి రాజకీయం ఎలా మారనుందో.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.