janampulse

ఈ ఐదు సెగ్మెంట్లో వైసీపీ వర్సెస్ జనసేన

These five segments tough war between Janasena and YSRCP

గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ వేవ్స్ బాగానే ఉన్నాయని. ముఖ్యంగా కాపులు అందరూ పవన్ కు ఓటు వేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్దితి దారుణంగా మారిపోతుంది అని చెబుతున్నారు జనసేన సైనికులు. అయితే జనసేన రిపోర్టులు అలా ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రిపోర్టులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పై నమ్మకం లేక అసలు తెలుగుదేశం వైపు కాపులు వెళ్లలేదు అని చెబుతున్నారు. ఇక వైసీపీకి ఓసారి అవకాశం ఇవ్వాలి అని మెజార్టీ సంఖ్యలో కాపులు భావించారు. జిల్లాలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాపులు మెజార్టీ ఉన్నారు. అయితే ఇక్కడ జనసేన ప్రభావం కచ్చితంగా ఉంటుంది అని అనుకుంటున్నారు. ముఖ్యంగా అందులో ఏ సెగ్మెంట్లు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఏలూరులో జనసేనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా టఫ్ పోరు కొనసాగింది అని చెబుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మూడో స్ధానంలో ఉంటుంది అని చెబుతున్నారు. ఒకటి వైసీపీ లేదా రెండు జనసేన అవుతుంది. లేదా జనసేన గెలిస్తే ప్రధమ స్ధానం వారికి, వైసీపీ రెండోస్ధానంలో ఉంటుంది అని అంటున్నారు.. ఈ ఐదు చోట్లా పోటీ చేసిన తెలుగుదేశం క్యాండిడేట్లు గట్టివారు అయినా, ఆర్దికంగా బలవంతులు అయినా సరే ఇక్కడ యువత ముఖ్యంగా జనసేన వైపు ఉండటం పార్టీకి లాభించింది అంటున్నారు విశ్లేషకులు.

ముఖ్యంగా పాలకొల్లులో జగన్ చివరగా వైసీపీ అభ్యర్దిని ప్రకటించడం, అలాగే అప్పటి వరకూ వైసీపీలో ఉన్న గుణ్ణం నాగబాబు వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లి సీటు సంపాదించడం. ఇవన్నీ చూస్తుంటే పాలకొల్లులో గట్టి పోటీ జరిగింది అని తెలుస్తోంది, ఇక పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగి భీమవరం లో పోటీ చేయడంతో ఇక్కడ నుంచి టఫ్ పోరు కొనసాగింది.

ఇక భీమవరం పాలకొల్లు సెగ్మెంట్ల తర్వాత నరసాపురం రేసులో ఉంది అని చెబుతున్నారు … తర్వాత ఏలూరు తర్వాత తాడేపల్లి గూడెం సెగ్మెంట్లు ఉంటాయి అని చెబుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్ల వల్ల ఇక్కడ జనసేన భారీగా టఫ్ పోటి ఇచ్చి ఉంటుంది అని చెబుతున్నారు. ఈ ఐదు సెగ్మెంట్లో వైసీపీ జనసేన మధ్య మాత్రమే పోటీ జరిగింది అని తెలుగుదేశం అభ్యర్దులు దరిదాపులో ఉండరు అని అంటున్నారు. మరి ఫలితాలలో చూడాలి ఎవరు గెలుస్తారో.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.