చంద్రబాబు పై జగన్ మొదటి అస్త్రం ఇదే

This is the Jagan first axis of Chandrababu

ఏపీ నిర్మాత అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబుకి పెద్ద పేరు పెట్టారు.. కాని ప్రజలు మాత్రం రెండోసారి అధికారం ఇవ్వలేదు, అయితే ఆ పార్టీ శ్రేణులు కూడా ఇప్పుడు ఎలాంటి కామెంట్లు చేయడం లేదు, బాబుకు వచ్చిన రిజల్ట్ గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.. ఇంత దారుణమైన ఓటమి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు, ఇదే తొలిసారి అని చెబుతున్నారు ప్రజలు. ఇక అధికారంలోకి వచ్చి జగన్ అసలు తన దూకుడు ఆపడం లేదు, పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు బయటపెడతాను అని చెబుతున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది.

చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున విమర్శల పాలైన పథకం ఏదైనా ఉందంటే అది నీరు చెట్టు అనే చెప్పవచ్చు. ఈ పథకంపై అటు అప్పట్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ఇప్పుడు సీఎం జగన్ దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారట. ఇదే దేశం నేతలలో అంతర్మధనానికి కారణం అయింది.

వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలనే ఉద్దేశ్యంతో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం చివరకు ప్రజాధనం పార్టీ పెద్దల జేబులను తడిపే సాధనంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. చోటా మోటా లీడర్లు అందరూ ఈ పనులు చేపట్టి కోట్లకు పడగలెత్తారు అని విమర్శలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి సరిగ్గా వారం రోజుల ముందు ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల చెల్లింపులు నీరు-చెట్టు కాంట్రాక్టర్లకు టీడీపీ అనుకూలంగా వ్యవహరించే అధికారి ద్వారా ఆర్థిక శాఖ నుంచి చెల్లింపులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా నూతన సీఎం జగన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ పథకం అలాగే చెల్లింపుల గురించి పూర్తి వివరాలు ఇవ్వాలి అని అధికారులకు ఆదేశాలు జారి చేశారట, చంద్రబాబు హయాంలో దారుణమైన అవినీతి జరిగింది అని బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు. ఇవన్నీ జగన్ బయటపెట్టాలి అని కోరుతున్నారు. అందుకే ఏపీ ఇంతటి ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది అని చెబుతున్నారు. ఎక్కడ ఏ అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదు అని సీఎస్ కు జగన్ ఇప్పటికే ఆదేశాలు జారిచేశారట.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.