టీడీపీపై తోట యూరట్న్ షాక్ లో బాబు

Thota trimurthulu shock to TDP

ప్రజావేదికపై ఏపీలో ఇప్పుడు చిచ్చు వచ్చింది అని చెప్పాలి. ఇప్పటికే నేతలు అందరూ కూడా పార్టీలో ఉంటారా ఉండరా అనే గజిబిజి గందరగోలం ఉంది టీడీపీలో.. ఈ సమయంలో తెలుగుదేశంం పార్టీ లో రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు కామెంట్లు చేయడం పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చింది .ఈ ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. ఇప్పటి వరకూ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలుపొందిన తోట త్రిమూర్తులు , 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఉంటే పరిస్దితి ఎలా ఉంటుందో అనే డైలమా ఆయనకు ముందు నుంచి ఉంది.

చంద్రబాబు ఫారెన్ ట్రిప్ కు వెళ్లిన సమయంలో తోట14 మంది కాపు మాజీ ఎమ్మెల్యేలతో తమ టీమ్ తో హంగామా చేశారు.. కాపు కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు అందరితో సమావేశం అయ్యారు. అయితే పార్టీ ఓటమికి గల కారణాలు విశ్లేషించాము అని మాత్రమే తెలియచేశారు. ఇక ఆయన బీజేపీలో చేరేందుకు సిద్దం అయ్యారు అని అందరూ అనుకున్నారు , ముఖ్యంగా ఇవే వార్తలు వినిపించాయి.. తాను పార్టీ మారడం లేదు అని చెప్పారు. కాని ఆయన పార్టీ మారతారు అని, తనతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలను సైతం చేర్చేందుకు మంతనాలు జరుపుతున్నారు అని మరో టాక్ వినిపిస్తోంది.

ఇక ఇప్పుడు ప్రజావేదిక పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ సమయంలో టీడీపీలోనే ప్రజా వేదికపై టీడీపీ నేతలు భిన్న స్వరాలు విన్పిస్తున్నారు. సీనియర్లు సైతం ప్రజా వేదిక భవనాన్ని కూల్చివేయడాన్ని తప్పుబడుతున్నారు. కానీ, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాత్రం ప్రజా వేదిక కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేయడం సరైంది కాదని తేల్చి పారేశారు. దీంతో ఆయన పార్టీమారతారా అనే ఆందోళన పార్టీ నేతల్లో వచ్చింది. రాజకీయ పార్టీ ఒకవైపు అయితే నాయకుడు ఒకవైపు ఉండరు, అందరి వాయిస్ ఒకేలా ఉండాలి. కాని తోట స్వరం మారింది. దీంతో అందరూ పెద్ద ఎత్తున ఈవిషయం గురించే చర్చించుకుంటున్నారు.

ప్రజా వేదికను కూల్చివేయడంపై ఆయన స్పందించారు.చంద్రబాబు మెప్పు కోసం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.చంద్రబాబుకు భజన చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ నేతలు మారకపోతే ప్రజలు క్షమించరని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజా వేదిక కూల్చివేతను నిరసిస్తూ ఆందోళన చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మొత్తానికి ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పుడు టీడీపీ నేతలకు పెద్ద ఆలోచనగా మారింది. సొంత పార్టీ నేతనే భజన చేస్తున్నాడు అని అనడం ఇక్కడ కొసమెరుపు అంటున్నారు విశ్లేషకులు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.