వైసీపీలో ఎమ్మెల్సీ రేస్ స్టార్ట్ సెకండ్ ఎవరికి

To whom MLC Race Start Second in YCP

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. జగన్ సీఎం అయ్యారు, ఇక పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమించిన వారికి అందరికి జగన్ కూడా పదవులు ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ పూర్తి చేశారు జగన్, ఇక తర్వాత నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయనున్నారు. ఈ సమయంలో ఇప్పుడు చాలా మంది పేర్లు ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తున్నాయి. ఇక దర్శి నుంచి సీటు వదులుకుని తను తరపున ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తా అని చెప్పిన మాజీ ఎమ్మెల్యే బుచేపల్లికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి రానుందట. అయితే జగన్ ఇప్పటికే తెలియచేశారు గుంటూరులో ఇఫ్తార్ విందులో, మొదటి ఎమ్మెల్సీ మైనార్టీకి ఇస్తాను అని ,తర్వాత ఎమ్మెల్సీ అవకాశం బూచేపల్లికి రానుంది అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి త్వరలో ఎమ్మెల్సీ పదవి వరించనున్నదని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్దికి కట్టుబడి ఉన్నామని మంత్రి సురేష్, బాలినేని తెలియచేశారు. మొత్తానికి గతంలో జగన్ ఇచ్చిన హామీ ప్రకారం బూచేపల్లి కుటుంబానికి జగన్ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వనున్నారట .తాను పోటీ చేయకపోయినా ఆయన అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తాను అని తెలియచేశారు..2009లో శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. వైయస్ అండదండలు ఆయనకు పుష్కలంగా ఉండేవి

తర్వాత జగన్ పంచన చేరారు. వైసీపీ కీలక నేతగా ఎదిగారు. 2014లో వైసీపీ తరపున దర్శి నుంచి పోటీ చేశారు. కాని ఇక్కడ శిద్దా రాఘవరావు గెలిచారు. తర్వాత ఆయన పార్టీ తరపున అక్కడ బాధ్యతలు వేరే వారికి ఇవ్వాలి అని తెలియచేశారు.. ఇంచార్జ్ ని మార్చాలి అని జగన్ ని కోరారు, ఆయన కోరిక మేరకు జగన్ అక్కడ పలువురిని మార్చారు. ఇక ఈ ఎన్నికల్లో ఇక్కడ వేణుగోపాల్ కు టికెట్ ఇచ్చారు జగన్. ఆయన గెలుపొందారు. ఇక బూచేపల్లికి మన ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీ ఇస్తాను అని హామీ ఇచ్చారు. ఆయన అలాగే ఆయన హామీని నిలబెట్టుకునే ఆలోచనలో ఉన్నారట. త్వరలో ఎమ్మెల్సీ పదవులు కూడా భర్తీ కానున్నాయి.. ఇప్పటికే రాజీనామా చేసిన స్ధానాలు ఎమ్మెల్సీలు ఖాళీ ఉండటంతో జగన్ వాటిపై కూడా దృష్టి పెట్టనున్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.