
ఆ మంత్రులకు బిగ్ రిలీఫ్..టీఆర్ఎస్‌కు తప్పిన కొత్త టెన్షన్
Telangana MLC Elections: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలను ఏకగ్రీవం ద్వారా తన ఖాతాలో వేసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. పోలింగ్ జరిగిన మిగతా స్థానాల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని స్థానాల్లో పోటీ అనివార్యం కావడంతో.. అక్కడ కూడా గెలుపు ఖాయం చేసుకోవాలని ప్రయత్నించిన టీఆర్ఎస్.. ప్రత్యర్థులు బరిలో ఉన్న స్థానాలను కూడా తన సొంతం చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు తన ఖాతాలో వేసుకున్న గులాబీ పార్టీ.. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానంలో జరిగిన ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.. ఈ నెల 10వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా.. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. ఓట్లు తక్కువగా ఉండడంతో.. ఫలితం కూడా త్వరగానే తేలిపోయింది. ఆరు స్థానాలను ఏకగ్రీవం ద్వారా తన ఖాతాలో వేసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. పోలింగ్ జరిగిన స్థానాల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటింది.
కరీంనగర్ జిల్లా నుంచి TRS పార్టీ అభ్యర్థులు ఎల్. రమణ, భానుప్రసాద్ రావు, ఖమ్మం జిల్లాలో తాత మధుసూదన్, ఆదిలాబాద్ జిల్లాలో దండె విఠల్, మెదక్ జిల్లాలో యాదవరెడ్డి, నల్గొండ జిల్లాలో ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు.. మొత్తంగా ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం చేసుకున్న అధికార పార్టీ.. మరో ఆరు చోట్ల కూడా తమ అభ్యర్థులకు తిరుగులేని విజయాన్ని అందించింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో అన్నీ సీట్లు తమ సొంతం కావడంతో టీఆర్ఎస్ రిలీఫ్ అయినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ నేతలు, శ్రేణుల టెన్షన్ కూడా తొలగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కరీంనగర్‌లోని ఒక స్థానం, అదిలాబాద్ స్థానం నుంచి స్వతంత్రులు బరిలో ఉండటం.. వారికి మాజీమంత్రి ఈటల రాజేందర్ మద్దతు ఉండటంతో టీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలైంది. దీంతో టీఆర్ఎస్ నేతలు స్వయంగా తమ పార్టీకి చెందిన నేతలను క్యాంప్‌లకు తీసుకెళ్లారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్