హైదరాబాద్ నగరంలో పార్టీ సభ్యత్వంపైన టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి

TRS party is a special focus of the party's membership in the city of Hyderabad

హైదరాబాద్ నగరంలో పార్టీ సభ్యత్వంపైన టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి, చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమీక్షా సమావేశాలను నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభ్యత్వం జరుగుతున్న తీరుని కేటీఆర్ సమీక్షించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను నగర ప్రజల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ నాయకులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు చేరుకున్నాయని, కాళేశ్వరం వలన నగర నీటి అవసరాలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుందన్న కేటీఆర్ ఈ విషయాన్ని నగర ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. ముఖ్యమంత్రి ముందుచూపు వలనే నగరంలో తాగునీటి, విద్యుత్ కొరత లేదని కేటీఆర్ అన్నారు. రాజకీయంగాను నగరంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదన్న కేటీఆర్ ప్రజల్లోనూ టీఆర్ఎస్ పట్ల అభిమానం ఉన్నదని తెలిపారు.

పార్టీని సంస్ధాగతంగా మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సూచించారు. సమావేశం నుంచి పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభ్యులుగా చేరిన పలువురితో కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నదని, ఈ మేరకు నిన్ననే బీమా చెల్లించామని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి కేటీఆర్ తెలిపారు. 
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీలు పాల్గొన్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.