
ఈ 3 జిల్లాల్లో..ఆంధ్రా ప్రజలకు కేంద్రం అదిరే శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో..!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది. పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ జవాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని భారతి పవార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి డాక్టర్ భారతి పవార్ తెలిపారు.
అలాగే, ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్ కాలేజీ, అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధికి కూడా ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇవి కాకుండా పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని వెల్లడించారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్