విజయనిర్మల కన్నుమూత

Vijaya Nirmala Passed away

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూసారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్న విజయనిర్మల హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆమె ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి.

1946 ఫిబ్రవరి 20న జన్మించిన విజయనిర్మల అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన ఎక్కువ సినిమాలలో హీరో, ఆమె భర్త సూపర్ స్టార్ కృష్ణే కావడం గమనార్హం.

వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా దాదాపు 50 సినిమాలలో నటించారు. విజయనిర్మల తొలిసారిగా 1971 సంవత్సరంలో సినిమాకు దర్శకత్వం వహించారు. యద్దనపూడి సులోచనరాణి రచించిన ‘మీనా’ నవలను అద్భుతంగా తెరకెక్కించారు విజయనిర్మల. ఈ సినిమా సూపర్.. డూపర్ హిట్ అయ్యింది.

దేవుడు చేసిన మనుషులు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, పెళ్లిసంబంధం, దేవాదాసు, సాక్షి, మారినమనిషి, కురుక్షేత్రం, రౌడీ రంగమ్మ, కిలాడీ క్రిష్ణుడు వంటి చిత్రాలలో విజయనిర్మల అద్భుత నటనను ప్రదర్శించారు.

బాపు దర్శకత్వం వహించిన సాక్షి చిత్రం షూటింగ్ సమయంలో హీరో కృష్ణతో ప్రేమలో పడ్డారు విజయనిర్మల. ప్రముఖ కవి ఆరుద్ర స్వయంగా పూనుకుని వీరిద్దరి వివాహం జరిపించారు.

సినీ పరిశ్రమలో ప్రఖ్యాత పురస్కారంగా చెప్పుకునే రఘపతి వెంకయ్య అవార్డును విజయనిర్మల అందుకున్నారు. రంగుల రాట్నం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన విజయనిర్మల తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించారు.

ఏడేళ్ల వయసులో తమిళ చిత్రం మశ్చరేఖతో బాల నటిగా సినిరంగ ప్రవేశం చేసారు విజయనిర్మల. 11 సంవత్సరాల వయసులో పాండురంగ మహత్యం సినిమాలో క్రిష్ణుని పాత్రలో బాలనటిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు విజయనిర్మల. ఆమె మరణం పట్ల తెలుగు చిత్ర సీమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.