పవన్ నాయుడిపై విజయసాయిరెడ్డి 3 పంచ్ లు

మొత్తానికి జనసేనాని పవన్ కల్యాణ్ పొలిటికల్ టూర్ వైసీపీ పై టార్గెట్ అనేలా మారిపోయింది. సీమ టూర్లో పవన్ చేసిన ఘాటు వాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు, ఇక పవన్ కల్యాణ్ తాజాగా వైయస్ జగన్ రెడ్డి అని పిలుస్తున్నారు. దీంతో తాము కూడా పవన్ నాయుడు అని పిలుస్తాం అని కౌంటర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు, తాజాగా విజయసాయిరెడ్డి వైసీపీ తరపున పవన్ పై పంచ్ వేశారు ట్విట్టర్ వేదికగా అవి ఏమిటో చూద్దాం.

నీ ప్యాకేజీ పార్టీని ప్రజలు గుర్తించకనే డిపాజిట్లు కూడా దక్కనంతగా ఛీ కొట్టారు. దత్తపుత్రుడివని తెలిసే భీమవరం, గాజువాక ఓటర్లు స్థానిక నాయకులను అక్కున చేర్చుకున్నారు. నువ్వే పెద్ద తిరస్కృతుడివి. ఇంకొకరిని గుర్తించాలా, విస్మరించాలా అనే స్థాయి నీకెక్కడిది పవన్ నాయడు?

వానపడుతుంటే, ఎండ కాస్తుంటే గొడుగు పట్టుకుని బయటకు వెళ్తారు ఎవరైనా. దత్త పుత్రుడు ఈ రెండిటికీ భిన్నం. శీతాకాలంలో గొడుగుతో తిరుగుతాడు. గంట గంటకూ చిత్త భ్రమలకు లోనవుతుంటాడు. ఏ సమయంలో ఏ డైలాగ్ వదులుతాడో అంతుబట్టదు. బిజేపీలో విలీనానికి గ్రౌండ్ ప్రిపేరు చేసుకుంటున్నాడు.

ఒకాయన 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఇంకొకాయన అజ్ణానాంధకారాన్ని కవర్ చేసుకునేందుకు రాజ్యాంగాన్ని ఔపోసన పట్టానంటాడు. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇంత నీచత్వానికి పాల్పడాలా అని ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారి పోయారిద్దరూ. అంటూ ట్వీట్లు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.