లోకేష్ ఇక మారవా విజయసాయిరెడ్డి పంచ్

Vijayasai reddy fires on Nara Lokesh

ప్రజలకు రాజుల్లా -తెలుగుదేశం పార్టీలో మహారాజుల్లా ఇప్పటి వరకూ లోకేష్ బాబు రాజకీయంగా వెలుగొందారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓటమిపాలైన చంద్రబాబు తనయుడికి సీఎంగా బాబు ఉండటంతో, బ్యాక్ డోర్ నుంచి ఎమ్మెల్సీ కం మంత్రి పదవి ఇచ్చారు. దేశంలో ఇది చరిత్ర అని చెప్పాలి . కాని పార్టీలో నేతలు అందరూ కోరుకున్నా ప్రజలు మాత్రం నారాలోకేష్ కి ఈసారి ఓటమి ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఐదు సంవత్సరాల టీడీపీ పాలనలో బాబు మార్కెంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పార్టీ ఈ పరిస్దితిలో ఉంది అంటే చినబాబు హస్తం కూడా ఉంది అనడంలో సందేహం లేదు అనేది . ఇది ఆపార్టీ నేతలు చెప్పేమాట.

ముందు లోకేష్ ఈ సంవత్సరం వరరకూ పార్టీ తరపున వాయిస్ వినిపించకుండా ఉంటే బెటర్ అనేది తెలుగుదేశం సీనియర్లు ఇస్తున్న సలహా.. కాని లోకేష్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి.. ఇలా అడ్డంగా ఇరుక్కుపోతున్నారు. లోకేష్ ప్రహసనాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరోసారి అడ్డంగా బుక్కయ్యారు మాజీ మంత్రి లోకేష్.

ఏపీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో చేసిన ట్వీట్తో లోకేష్ అడ్డంగా బుక్కయ్యారు. ఇంతకీ ఎవరి దగ్గర బుక్ అవ్వకూడదో ఆయన దగ్గర బుక్ అవ్వడంతో ఇది రాష్ట్రం అంతా మళ్లీ వైరల్ అయింది, ఇక వైసీపీ నేతలు కూడా దీనిని చూసి లోకేష్ బాబు మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అని సటైర్లు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఓ రేంజ్లో టీడీపీ నాయకుడు లోకేష్ ని ఆడుకున్నారు.

పోలవరం ప్రాజెక్టు అంచనాలపై అధ్యయనం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే కలవరం టీడీపీ నేతల్లో వ్యక్తమయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో, టీడీపీ యువనేత లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన Rs.55,548 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించడం జరిగింది. గతంలో తెదేపా ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది? అంటూ ఆయన ట్విట్టర్లో ప్రశ్నించారు. దీనిపై సాయిరెడ్డి పంచ్ వేశారు. ఇక దీనిపై ఆయన ఘాటుగానే సమాధానం ఇచ్చారు అని చెప్పాలి.

పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి వైఎస్ జగన్ గారు ప్రధానిని కలిసినప్పుడు కోరారు. దానికి స్పందనగానే రూ.55,548 కోట్ల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ దొరికింది. కానీ, ఇది తన తండ్రి కష్టానికి ఫలితమని లోకేష్ డప్పుకొట్టుకోవడం ఆపాలి. ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీది అని లోకేష్ ట్వీట్ కి విజయసాయిరెడ్డి పంచ్ వేశారు. ఇక ప్రజావేదిక అనేది అక్రమ కట్టడం ఇలాంటివి కూల్చితే సపోర్ట్ చేయాల్సింది పోయి వాటిని ఆపాలి అని అనడం దారుణం అని, ఒకసారి యాక్ట్ చట్టాలు చదువుకోండి అని మాజీ తెలుగుదేశం పాలనలో మంత్రులు అందరికి సటైర్ వేశారు ఆయన.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.