janampulse

విజ‌య‌సాయిరెడ్డి అదిరింది ఇది కోలుకోలేని దెబ్బే 

Vijaya Sai Reddy-Janampulse.com

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలుగుదేశం పుట్ట‌లో వేలు పెట్టి కెలుకుతున్న నేత‌గా తెలుగుదేశం భావిస్తోంది… అయితే ఆయ‌న‌కు ఆయ‌న ఎవ‌రిని  విమ‌ర్శ‌లు టార్గెట్ గా చేయ‌డం లేదు అని వైసీపీ చెబుతోంది…తెలుగుదేశం చేస్తున్న రాజ‌కీయాల‌ను ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు అని ఏపీలో తెలుగుదేశం చేసే అరాచ‌కాల‌ను ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు అని వైసీపీ తెలియ‌చేస్తోంది

 
అయితే 18 స్టేలు తెచ్చుకున్న చంద్ర‌బాబు తెలుగుదేశం త‌ర‌పున ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకున్నా ప‌క్క‌న కూర్చునే వారు ఎవ‌రు అంటే?  కేవ‌లం బాబు పక్కన ఉండేవారే ఆర్ధిక నేర‌గాళ్లు అని మాపై ముద్ర వేస్తున్న బాబు ఏ2 అని విజ‌య‌సాయిరెడ్డి పై నింద‌లు వేస్తున్న బాబు. రాజ‌కీయంగా త‌న ప‌క్క‌న అంబేద్క‌ర్ గాంధీలాంటి ఉత్త‌మ నాయ‌కుల‌ను కూర్చొబెట్టుకున్నారా ఇది వైసీపీ సూటి ప్ర‌శ్న‌,

 
రెండోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లిన సీఎం ర‌మేష్ సారా వ్యాపారం చేసుకునే వాడ‌ని, అలాగే సుజ‌నాచౌద‌రి బ్యాంకుల‌కు టోపీ పెట్టే వాడ‌ని అలాంటి వారు నా గురించి మాట్లాడ‌టం ఏమిట‌ని విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్ ఇవ్వడంతో ఇప్పుడు తెలుగుదేశం కూడా నిజ‌మా సారాయి వ్యాపారం చేస్తాడా అని సీఎం ర‌మేష్ గురించి వివ‌రాలు అడుగుతోంది అనే స‌టైర్లు వ‌స్తున్నాయి…

 
ఇక మారిష‌స్ బ్యాంకు నుంచి ప‌లు బ్యాంకుల‌కు ఈ సుజానా చౌద‌రి డ‌బ్బులు ఎగ్గొట్ట‌డం, ఇలాంటి వారిని పార్టీలో ప‌క్క‌న పెట్టుకున్న చంద్ర‌బాబు రాజ‌కీయాల్లో ఏం సంకేతం ఇస్తున్నారు అని బాగానే క‌డిగిపారేశారు విజ‌య‌సాయిరెడ్డి.. అయితే వీరు ఇరువురు డ‌బ్బుతో రాజ్య‌స‌భ‌కు వెళ్లిన వారే అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తుంది,  పార్టీలో ఏం సేవ చేశారు అంటే స‌మాధానం లేదు,  నిజంగా సేవ చేసిన వారికి పార్టీలో గుర్తింపు లేక బ‌య‌ట‌కు వెళుతున్నారు… ధ‌న‌మేరా తెలుగుదేశం లో మూలం, ధ‌నం ఉంటే  ప‌ద‌వీ బ‌లం అని వ్యాఖ్యలు కూడా వ‌స్తున్నాయి.

 
ఇక చంద్ర‌బాబు  ఛార్లెస్ శోభరాజ్ కన్నా నేరగాడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కామెంట్ చేశారు… సీఎంగా ఉన్నచంద్ర‌బాబు ఇటువంటి ప‌నులు చేస్తాడా అని విమ‌ర్శించారు.. ప్ర‌ధాని కాళ్లు ప‌ట్టుకున్నాను అని అన‌డం క‌రెక్ట్ కాదు, సభ‌ జ‌రిగిన ఫుటేజ్ బ‌య‌ట‌కు వ‌స్తే క‌చ్చితంగా వివ‌రాలు తెలుస్తాయి అని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.

 
విజ‌య‌సాయిరెడ్డి పొలిటిక‌ల్ గా ఎదగ‌డం బాబుకు ముందు నుంచి అస‌లు ఇష్టం లేదు.. అస‌లు ఎంపీగా విజ‌య‌సాయిరెడ్డిని  జ‌గ‌న్ పంపించిన‌ప్పుడు, ఆప‌డానికి తెలుగుదేశానికి ఎటువంటి చాన్స్ లేదు…అయితే ఏపీలో పాలిటిక్స్ లో తెలుగుదేశంలో ఇంత మంది ఉన్నా కేంద్రంలో రాజ‌కీయాలు చ‌క్క‌బెట్ట‌డంలో అస‌లు బాబుకు అంత స‌పోర్ట‌ర్స్ ఎవ‌రూ లేరు,

 
ఇటు జ‌గ‌న్ రాష్ట్రంలో వ‌న్ మ్యాన్ ఆర్మీలా విజ‌య‌సాయిరెడ్డిని  హ‌స్తిన‌కు పంపారు.. దీంతో రాజ‌కీయంగా జ‌గ‌న్ కు తిరుగులేకుండా పోయింది హ‌స్తిన‌లో… సో అందుకే విజ‌య‌సాయిరెడ్డిని టార్గెట్ చేసింది తెలుగుదేశం.. ఇటు విజ‌య‌సాయిరెడ్డి కూడా బాబు పై ఫైర్ అవుతూ నిరంత‌రం ఎటువంటి అక్ర‌మాలు తెలుగుదేశం చేసినా ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ ఉంటున్నారు.. అదీ అస‌లు విష‌యం రాజారెడ్డి ఫ్యామిలీ నుంచి వారికి ఆడిట‌ర్ గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి, ఇప్పుడు జ‌గ‌న్ ఫ్యామిలీకి ఆడిట‌ర్ గా ఉన్నారు… దీంతో నాడు వైయ‌స్ ఆర్ కు సపోర్ట్ ర్ గా విజ‌య‌సాయి రెడ్డి ఉంటే, నేడు జ‌గ‌న్ కు ఉన్నారు… ఇదే బాబుకు తెలుగుదేశం నాయ‌కుల‌కు కంటిలో న‌లుసులా ఉంది.. ఇలా తెలుగుదేశంలో ఎవ‌రైనా ఒక్క నాయ‌కుడు పేరు చెప్పండి అంటే నో డౌట్ ….సంవ‌త్స‌రం అయినా ప‌డుతుంది… ఎవ‌రి పేరూ  చివ‌ర‌కు చెప్ప‌లేరు అంటారు సీనియ‌ర్లు, ద‌టీజ్ 40 ఇయ‌ర్స్ ఎక్స్ పీరియ‌న్స్
విశ్లేష‌ణ !! వీ.జీ

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.