
కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారు ? విజయశాంతి సూటి ప్రశ్న
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుని కొందరు అపహాస్యం చేశారు, అయితే దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు, దేశంలో అందరూ ఓ విధానంలో వెళుతున్నాం. ఈ సమయంలో ప్రధాని ఇచ్చిన పిలుపుని గౌరవించాలి అని తెలిపారు ఆయన , ఇలా విమర్శించే వారిపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
తాజాగా ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలకు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఓ ప్రశ్న వేశారు…ప్రధాని మోదీని ఉద్దేశించి ఒవైసీ అవహేళనగా ట్వీట్లు చేశారని… గతంలో ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడుతూ ప్రధాని పిలుపును సోషల్ మీడియాలో అవహేళన చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారని… మరి, ఒవైసీపై చర్యలు తీసుకునే విషయంలో సీఎం క్లారిటీ ఇవ్వాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
ప్రధానిని అవహేళన చేసిన ఒవైసీపై చర్యలు ఉంటాయా? లేదా? చెప్పాలని నిలదీశారు. దీపాన్ని ఆరాధించే దేశంలోని అత్యధిక ప్రజల మనోభావాలకు సంబంధించిన దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమర్థించిన నేపథ్యంలో… ఓవైసీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్