
రాజధానిపై క్లారిటీ ఇస్తారా..?విశాఖ టూర్ కు సిద్ధమైన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) శుక్రవారం విశాఖపట్నం (Visakhapatnam) లో పర్యటించబోతున్నారు. సీఎం ఎప్పుడు వైజాగ్ వెళ్లడం సాధారణమే కానీ.. ఈ పర్యటన మాత్రం కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది.
(Andhra Pradesh) (AP CM YS Jagan) శుక్రవారం (Visakhapatnam) లో పర్యటించబోతున్నారు. సీఎం ఎప్పుడు వైజాగ్ వెళ్లడం సాధారణమే కానీ.. ఈ పర్యటన మాత్రం కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. కారణం రాజధాని అంశం. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి పలు ముహూర్తాలు కూడా పెట్టారు. ప్రియమైన స్వామి స్వరూపా ఆశీస్సులతో రాజధాని పనులు ముమ్మరం చేయాలి అనుకున్నారు. కానీ ఇంతలోనే కోర్టు జోక్యంతో మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నారు. ఆ బిల్లు ఉపసంహరణ తరువాత తొలిసారి విశాఖలో అడుగుపెడుతున్నారు. మరి రాజధానిపై క్లారిటీ ఇస్తారా..? విశాఖ ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారు.
సీఎం జగన్ తొలిసారి ఓ పాలనా పరమైన కార్యక్రమానికి తొలిసారి విశాఖ వస్తున్నారు. గతంలో రెండు మూడు సార్లు విశాఖ వచ్చినా.. శారద పీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకోవడమే.. లేదా ఒడిశ Srikakulamవెళ్తూ విశాఖలో ఆగడమో తప్ప.. నేరుగా విశాఖ వచ్చిన సందర్భం లేదు. గతంలో ఓ సారి అనుకున్నా ఆ పర్యటన వాయిదా పడింది. దీంతో ఈ సారి సీఎం జగన్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. విశాఖ పర్యటన ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ, (Visakhapatnam) నగరం, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సభలో ఆయన ఏం మాట్లాడుతారు అన్నది కూడా ఉత్కంఠ పెంచుతోంది. ఎందుకంటే గతంలో అనేక సార్లు విశాఖనే ఏపీకి పరిపాలన రాజధాని అని ప్రకటిస్తూ వచ్చారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్