janampulse

ఓట్లు నాకు పాట్లు మీకు బాబుపై కుప్పం ఏమంటోంది

Votes me pots you know what a heap on Babu

సీఎంల‌ను గెలిపించే నియోజ‌క‌వ‌ర్గాలు అంటే అది ఓ అద్బుత న‌గ‌రంగా ఉంటుంది అని భావిస్తారు అంద‌రూ… కాని రాష్ట్రంలో ఆ నియోజ‌కవ‌‌ర్గం రోల్ మోడ‌ల్ గా మారుతుంది అని భావిస్తారు, కాని చంద్ర‌బాబు మూడు సార్లు సీఎంగా అక్క‌డ నుంచి వ‌చ్చారు, ఆయ‌న‌ని కుప్పం నుంచి సీఎం స్ధాయికి తీసుకువ‌చ్చిన‌ జ‌నాల్ని మాత్రం చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేదు, కుప్పం నాడు ఎలా ఉందో నేడు అలాగే ఉంది.

Also Read ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్పిందే నిజ‌మా? మ‌రో సంచ‌ల‌న‌మే

పెద్ద అభివృద్ది చేసింది లేదు. పైగా ఇలా కోవిడ్ లాంటి విప‌త్క‌ర ప‌రిస్దితిలో ముప్పై ఏళ్లుగా గెలిపిస్తూ వస్తున్న కుప్పం వాసుల యోగ క్షేమాలు మరచి చంద్రబాబు హైదరాబాద్‌లో తన నివాసానికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సమయంలో నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదు.

దేశమంతా ఎమ్మెల్యేలు తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటు లో ఉంటూ సొంత డబ్బుతో నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలతోపాటు విటమిన్‌ టాబ్లెట్లను పంపిణీ చేçస్తున్నారు. కుప్పం ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం తనను గెలిపించిన కుప్పం, రాష్ట్రంతో సంబంధం లేనట్టు హైదరాబాద్‌లో ఉంటున్నారు.

పోని చంద్ర‌బాబు హైద‌రాబాద్ లో చిక్కుకున్నారు, మ‌రి ఇక్క‌డ ఉన్న స్దానిక నేత‌ల‌తో అయినా ఏదైనా సాయం చేయించాలి, కోట్ల రూపాయ‌ల ఆస్తి ఉన్న చంద్ర‌బాబు పోని త‌న నియోజ‌క‌వ‌ర్గానికి అయినా ఏమైనా చేస్తున్నారా అంటే శూన్యం అంటున్నారు జ‌నం, అస‌లు చంద్ర‌బాబుకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాంట్ ఫ్రంట్ లైన్ అని చెప్పే నేత‌లు అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు. అంటే ఓట్ల వ‌ర‌కూ జ‌నం కావాలి త‌ర్వాత వాళ్ల పాట్లు వారు ప‌డాలి ఇదేనా బాబు నైజం.

ఈ స‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం అందించే రేష‌న్ అలాగే అక్క‌డ పేద‌ల‌కు అందిస్తున్న 1000 రూపాయ‌లు కుప్పంలో అంద‌రికి అందుతున్నాయి, ఓట్లు వేసి గెలిపించిన చంద్ర‌బాబు కంటే తాము గెలిపించ‌న వైసీపీ ఇక్క‌డ అన్నీ ప‌నులు చేస్తోంది అని అంటున్నారు జ‌నం.

స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు, దాతలు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు అందించి, పేదల ఆకలి తీరుస్తున్నారు.. జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలు ప్రజలకు ఏ విధంగాను సాయం చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో ఎమ్మెల్యే రోజా, భూమన, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే ,ఇలా అంద‌రూ సాయం చేస్తున్నారు.

కాని చంద్ర‌బాబు మాత్రం అస‌లు ఏమీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట.. మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబం, అమరనాథ్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, టీడీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని నమ్ముకున్న వారిని కూడా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఇక నైనా బాబు మారి, స్ధానిక నేత‌ల ద్వారా సా‌యం అందించాలి అని కోరుతున్నారు జ‌నం.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.