
కాకినాడలో టీడీపీకి బిగ్ షాక్
మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. ఎక్స్‌అఫీషియో హోదాలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఓటు వేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్-1 సత్తిబాబుపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. కోర్టు తీర్పు వల్ల అవిశ్వాస తీర్మానం ఫలితాన్ని రిజర్వులో ఉంచినట్లు ప్రొసీడింగ్ అధికారి, జేసీ లక్ష్మీశ ప్రకటించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో TDP అసమ్మతి కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. ఎక్స్‌అఫీషియో హోదాలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఓటు వేశారు. కొత్త మేయర్ ఎవరనేది ప్రకటించొద్దని ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
2017లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను 48 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 32 టీడీపీ, 10 వైసీపీ, 03 బీజేపీ, 03 ఇండిపెండెంట్లు గెలుపొందారు. అప్పట్లో ఇండిపెండెంట్‌లు అందరూ టీడీపీలో చేరారు. కొద్దిరోజుల క్రితం మేయర్ పావని వ్యవహారశైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. ఇటీవల జరిగిన రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు తమను ఇండిపెండెంట్ కార్పొరేటర్లుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానంపై లేఖ ఇవ్వడంతో ఇవాళ ఓటింగ్ జరిగింది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్