
టీడీపీ ఖాతాలోకే, అనుకున్నది సాధించారు! ఏపీ మంత్రికి ఝలక్
ఆచంటలో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. ఎంపీపీ పదవి కోసం టీడీపీ, వైసీపీలు పోటీ పడ్డాయి. ఇద్దరికీ జనసేన మద్ధతు అవసరంగా మారగా.. క్యాంపు రాజకీయాలు నడిచాయి.
ఏపీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజుకు ఎదురు దెబ్బ తగిలింది Achanta-Mppపదవిని TDP కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. ఎంపీపీ పదవి కోసం టీడీపీ, వైసీపీలు పోటీ పడ్డాయి. ఇద్దరికీ జనసేన మద్ధతు అవసరంగా మారగా.. క్యాంపు రాజకీయాలు నడిచాయి. టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను రహస్యప్రాంతాలకు తరలించారు. ఈ ఎంపీపీ పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా ఎంపీపీ పదవి టీడీపీకి, ఉప ఎంపీపీ పదవిని జనసేన పార్టీ దక్కించుకుంది. మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో ఆయనకు షాక్ అనే చెప్పాలి.
ఆచంట మండలంలో జెడ్పీటీసీతో పాటూ ఎంపీటీసీలను ప్రతిపక్షాలు దక్కించుకున్నాయి. జెడ్పీటీసీ పోరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కడలి రామగోవిందరాజుపై టీడీపీ అభ్యర్థి ఉప్పలపాటి సురేష్‌బాబు విజయం సాధించారు. మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ 6 చోట్ల, టీడీపీ 7, జనసేన 4 చోట్ల విజయం సాధించాయి. నియోజకవర్గ పరిధిలోని మిగిలిన మూడు మండలాల్లో మాత్రం అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పోడూరు, పెనుమంట్ర జడ్పీటీసీ స్థానాలను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే దక్కించుకున్నారు. పెనుగొండ మండలంలో టీడీపీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ ఎన్నికలు జరగలేదు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్