ఎన్నికల ప్రచారానికి బాలయ్య బాబు ఏం చెప్పారంటే

What did Balayya and chandraBabu say in the election campaign

మళ్లీ ఎన్నికల ప్రచారం ఊపు అందుకోనుంది, గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి , ఈ ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఈ సమయంలో హుజుర్ నగర్ ఉప ఎన్నిక మరోసారి ప్రచారాలతో హోరెత్తించనుంది. తమ సీటుని కోల్పోకూడదు అని కాంగ్రెస్ చూస్తుంటే, తెరాస మాత్రం కారు స్పీడుని ఇక్కడ మరింత పెంచింది. బీజేపీ కూడా తమకు ఇక్కడ కలిసి వస్తుంది అని చూస్తోంది.. ఇక తెలుగుదేశం తమ పట్టు అసలు ప్రజల్లో ఎలా ఉందో తెలుసుకునే పనిలో ఉంది.

హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రముఖు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారానికి హాజరు కానున్నారు. ఈనెల13నుంచి 18లోపు షెడ్యూల్ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుతో భేటీ అయి ప్రచారం మొదలైన విషయాలు చర్చించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రంగా పోటీచేసిన టీడీపీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ బాలయ్యని రంగంలోకి దించాలి అని చూస్తున్నారు, హుజూర్నగర్లో ఈనెల21న జరగనున్న ఉపఎన్నికపై అన్ని పార్టీలు ప్రధాన దృష్టిసారించాయి.. అందుకనుగుణంగా రోడ్షోలు, బహిరంగ సభలు ఏర్పాటుచేస్తున్నారు. సో తెలంగాణ అంతా ఇక్కడే చూస్తోంది. ఫలితం ఎలా ఉండబోతోందో అని.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.