janampulse

బీదా మస్తాన్ రావు – విజయసాయిరెడ్డి వీరిబంధం ఏమిటి

కుటుంబ రాజకీయాలు చూసుకుంటే చాలా మంది అన్నదమ్ములు రెండు వేరు వేరు పార్టీలో ఉన్నవారు ఉంటారు.. అయితే బంధం బలంగానే ఉంటుంది రాజకీయం మాత్రం వేరుగా ఉంటుంది.. తాజాగా ఏపీలో ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు కనిపిస్తున్నాయి.. తాజాగా నెల్లూరు నుంచి బీద మస్తాన్ రావు వైసీపీలో చేరిపోయారు.. ఆయన చేరిక సింహపురి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయనైతే పార్టీ మారారు.. కానీ ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ అయిన బీదా రవిచంద్ర పరిస్థితి ఏంటన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే అన్న వల్లే తమ్ముడు రాజకీయంగా ఇంత ఫేమ్ సంపాదించాడు అంటారు. ఈ సమయంలో ఆయన పార్టీ మారిపోయి వైసీపీలో చేరితే తమ్ముడు టీడీపీలో కొనసాగుతున్నారు.

బీదా రవిచంద్ర, బీదా మస్తాన్ రావు ఇద్దరు సోదరులన్న సంగతి తెలిసిందే. అయితే మస్తాన్ రావు ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు, అయితే ఆయన తమ్ముడు రవిచంద్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీగా శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి టీడీపీని వీడితే రెండు పెద్ద పదవులు కోల్పోయే ప్రమాదం ఉంది, అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళితే ఆ తర్వాత వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఆయనకు వెంటనే అవకాశం ఇస్తారా? అనే డౌట్ ఇప్పుడు మొదలైంది.. అలా సీఎం జగన్ చేస్తే పార్టీలో ఉన్న సీనియర్లు అలాగే పదవి కోసం చూసిన వారు నొచ్చుకునే అవకాశం లేకపోలేదు.

బీదా సోదరులకు అక్వా ఇండస్ట్రీస్ వున్నాయి. ఈ వ్యాపారంలో సోదరులిద్దరు భాగస్వాములు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన అక్వా సదస్సుకు బీదా మస్తాన్ రావు హాజరయ్యారు. దాంతో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం అప్పుడే మొదలైంది. ఇక ఆయన పార్టీలో చేరిపోయారు, అయితే వ్యాపారంలో అగ్రగణ్యులుగా ఉన్నారు, అందుకే రాజకీయంగా కూడా పదవుల్లో ఉండాలి అని సహజంగా కోరుకుంటున్నారు. బీదా మస్తాన్ రావుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వారి యంగ్ ఏజ్లో సహ ఉద్యోగులు కావడంతో ఆ పరిచయంతో ఆయన పార్టీ మారి వుంటారని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి బీదా ఫ్యామిలీ పాలిటిక్స్ నెల్లూరులో టాక్ ఆఫ్ ది సిటీగా మారాయి.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.