Breaking News

మే 27నమహానాడుపై తెలుగుదేశం ఆలోచన ఏమిటి

What is the idea of TDP on May 27th

తెలుగుదేశం పార్టీ నేతలకు రెండు టెన్షన్లు పట్టుకున్నాయి.. అయితే ఇందులో ఫలితాల విషయం ఒకటి అనేది తెలిసిందే, మరోక టెన్షన్ కూడా ఉందట, ఆ పార్టీనేతల ద్వారా తెలుస్తోంది, ఇంతకీ ఆ విషయం ఏమిటి అంటే? చాలా విచిత్రమైన పరిస్దితి అని చెబుతున్నారు.. మే నెలలో టీడీపీకి ఓ పండుగ ఉంది అనేది తెలిసిందే. టీడీపీ కి సంబంధించి మహానాడు కార్యక్రమం జరగనుంది. గెలుపు ఓటములను పక్కనబెట్టి మరీ మహానాడు కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు టీడీపీ శ్రేణులు.. అయితే ఈసారి చంద్రబాబు గెలిస్తే మాత్రం ప్రపంచంలో కనివీని ఎరుగని రీతిన మహానాడు చేయాలి అని చూస్తున్నారు.

లేకపోతే పార్టీ తరపున మహానాడు ఒకరోజు చేసి ముగించాలి అని భావిస్తున్నారట.. మహానాడు అంటే నెల ముందు నుంచి హడావుడి ఉంటుంది ..సభాప్రాంగణం ఎంపిక నుంచి కమిటీలు ఇలా భోజనాలు, తీర్మాణాలు, అతిధులు ప్రసంగాలు ఒకటా రెండా అనేక అంశాలు ఉంటాయి. అందుకే తెలుగుదేశం పార్టీకి మహానాడు అంటే ఓ పండుగ అని చెబుతారు.. మొత్తం ఏపీని అంతా పసుపుమయం చేస్తారు ఆ నాయకులు, ఎన్నికలు ఈ ఏడాది జరగడంతో నెల రోజుల నుంచి కనిపించాల్సిన హడావుడి ఇప్పుడు కనిపించడం లేదు,

అరైంజ్ మెంట్స్ కూడా ఏమీ వార్తలు బయటకు రావడం లేదు.. ఇక ఈ నెల 27న మహానాడు జరపాల్సి ఉంది.. మరి ఇది ఎన్ని రోజులు జరుపుతారు అనేది ఇప్పుడు చర్చ.. మే 23 న ఫలితాలు రానున్నాయి. అలాగే 27 న మహానాడు జరపాలి అంటే ఫలితాలు వచ్చిన తర్వాత నాలుగు రోజులకు మహానాడు చేయాలి.. ఒకవేళ గెలిస్తే అన్నీ స్పీడుగా ఏర్పాట్లుచేస్తారు, మరి ఓడిపోతే నాలుగు రోజుల్లోనే మహానాడు అట్టహాసంగా చేస్తే బాగోదు, కాబట్టి ఈసారి మహానాడు గురించి తెలుగుదేశం నేతలు ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారు.. స్టేట్ వైడ్ టాక్ అయితే నడుస్తోంది. మరి మహానాడు బాగా చేయాలి అంటే విజయం రావాలి, కాని ఫలితాలు రివర్స్ అయితే మాత్రం, మహానాడు లేదు ఏమీ లేదు అంటున్నారు పార్టీనేతలు.. అందుకే బాబు కూడా ఈసారి పెద్ద ఆసక్తి చూపించడం లేదట.. ఎందుకు అంటే ఇటు చంద్రబాబు వారసుడు కూడా మంగళగిరి నుంచి పోటీ చేశారు ఒకవేళ గెలవకపోతే ఇలా సంబరాలు చేసుకున్నారా అనే విమర్శ ప్రజల నుంచి కూడా వస్తుంది. అందుకే చంద్రబాబు ఈ విషయం గురించి సీనియర్లతో కూడా చర్చించడం లేదట. చూడాలి ఫలితాల ఎఫెక్ట్ ఇంకెన్నీ కార్యక్రమాలపై పడుతుందో.

విశ్లేషణ వీజీ

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.