janampulse
Breaking News

బాబుకు యామిని రాజీనామా లేఖ ఏముందంటే

తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.. పలువురు నేతలు బీజేపీ వైసీపీలలో చేరిపోయారు.. తాజాగా టీడీపీ నుంచి మరో వికెట్ పడింది. టీడీపీ అధికార ప్రతినిధిగా టీవీ డిబేట్లలో పాల్గొన్న సాధినేని యామిని టీడీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపించారు ఆమె. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు ఆయన నాయకత్వంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాను అని చెప్పారు.

నాయకుడికి ఉండాల్సిన ఓర్పు, చాణక్యత, ప్రజల పట్ల అభిమానం.. ఇవన్నీ బాబు నుంచి నేర్చుకొని నాయకురాలిగా తనను తాను మలుచుకున్నానని యామిని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోపాటు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఇతర బలమైన కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

అయితే యామీని టీడీపీకి గుడ్ బై చెబుతారు అని గత నెలరోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఇక బీజేపీ వైపు ఆమె వెళుతున్నారు అని తెలుస్తోంది.వంబర్ 10న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకుంటారని వార్తలొస్తున్నాయి. ఆమె రాజీనామా టీడీపీకి షాకింగ్ వార్త అనే చెప్పాలి.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.