జగన్ మద్దతు ఎవరికి జగన్ ఆలోచన ఏమిటి

What's the idea of the Jagan to whom is supporting

ఓ పక్క కాంగ్రెస్ నేతలు జగన్ కు దగ్గర కావడానికి ప్రయ్నతాలు మొదలు పెట్టారు, మరో పక్క బీజేపీ నేతలు కూడా జగన్ కు దగ్గర అవ్వాలి అని ఏమి కోరితే అది ఇవ్వాలి అని చూస్తున్నారు.. మరో పక్క తృతీయ కూటమికి సపోర్ట్ కావాలి అని కేసీఆర్ కూడా ఇప్పటికే జగన్ ని కోరారు. మొత్తానికి మూడు పార్టీలు జగన్ సాయం కావాలి అని చూస్తున్నాయి. మరో పక్క చంద్రబాబు మాత్రం బీజేపీతో చెలిమి చెడిపోయిన తర్వాత, జాతీయ పార్టీలకు యాంటీ అవుదాము అనుకుని, చిరవకు వెళ్లి కాంగ్రెస్ పంచన చేరారు. చివరకు ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన పార్టీ దగ్గరకే ఆయన చివరకు చేరారు అని చెప్పాలి.

ఇటు చంద్రబాబుకి తన తనయుడు లోకేష్ సీఎం అవ్వాలి అని ఎంత కోరక ఉందో తెలియదు కాని, అక్కడ సోనియాగాంధీ కంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ప్రధానిగా రాహుల్ అవ్వాలి అని, ఇక ఈ కోరికలు ఎప్పుడు తీరతాయో తెలియదు, అయితే బీజేపీ చంద్రబాబు ని నమ్ముతుందా అంటే ? మరోసారి అవకాశం లేదు అంటున్నారు ఆపార్టీ నేతలు. ఇటు జగన్ తమకు మద్దతు ఇస్తే కచ్చితంగా తమకు కలిసి వస్తుంది అని బీజేపీ భావిస్తోంది, ఇక రాహుల్ కోసం ఇంత కష్టపడుతున్న చంద్రబాబుని అసలు కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు, అని వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇటు కేరళ గుజరాత్ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేతల ద్వారా జగన్ ను సంప్రదించాలి అని చూస్తున్నారు దిల్లీ కాంగ్రెస్ నేతలు. అవసరం అయితే మూడు మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు అంటే తెలుసుకోవచ్చు ఎలాంటి పరిస్దితి ఉందో.

ఇక డీఎంకే అధినేత స్టాలిన్ తో కేసీఆర్ మంతనాలు జరిపారు , కాని వీరందరూ అదే చెట్టు కింద మొక్కలు, ఆ కాంగ్రెస్ అనే వృక్షం కింద ఉన్న ఈ పార్టీలు వేరే పార్టీకు సాయం చేయవు అనేది కేసీఆర్ ఇంకా గుర్తించాలి.. ఇక్కడ దక్షిణాది సెంటిమెంట్ చెప్పినా వారు పట్టించుకోరు, లోకల్ పార్టీలు ఎదగాలి ఇది అందరూ కోరుకునేది, కాని ప్రధాని పదవికి మళ్లీ వివాదం వస్తుంది గతంలో చూసిందే, అందుకే ఈసారి జాతీయ పార్టీలకే పట్టం కట్టాలి అని చూస్తున్నారు.. అందుకే ఇప్పుడు బీజేపీ లేదా కాంగ్రెస్ అనే పరిస్దితికి చాలా రాష్ట్రాలు వచ్చేశాయి. కాని జగన్ మాత్రం రాజకీయ స్వార్దం పక్కన పెట్టారు అని చెప్పాలి, జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే చాలు కేంద్ర మంత్రి పదవులు కూడా అక్కర్లేదు అనేలా ఉన్నారు.. సో అందుకే మూడు పార్టీలకు జగన్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు, కేవలం మా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే వారికి బహిరంగంగా మద్దతు తెలుపుతాను అని చెబుతున్నారు. సో నిజంగా ఈసారి ఇది ఎన్నికల్లో ప్రచారాల్లో కనిపించకపోయినా, ఇప్పుడు దేశంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి అనే సమయంలో ఈ ప్రత్యేక హోదా అంశం ముందు ఉండనుంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.