జనసైనికుడిగా వంగవీటి రాధా మార్పు ఎప్పుడంటే

When will Vangaveeti Radha change as a Janasainik

ఏపీ రాజకీయాల్లో ఈ సారి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నేతలు పార్టీలను కేరాఫ్ అడ్రస్ లను మార్చేస్తున్నారు.. ఇప్పటికే తెలుగుదేశం పార్టీపై కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఇక ఈ దెబ్బకు తెలుగుదేశం నేతలు పార్టీ మారిపోతున్నారు. మరో పక్క చంద్రబాబు కూడా పార్టీని వదిలివెళ్లిపోతున్న నేతలపై విమర్శలు చేస్తున్నా, ఇంటర్నల్ మీటింగుల వరకూ మాత్రమే పరిమితం అవుతున్నాయి.. ఇక నలుగురు రాజ్యసభ సభ్యులు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి నేతలు ఎప్పుడు ఎవరు బీజేపీలోకి జంప్ అవుతారు అనే టెన్షన్ చంద్రబాబుకు పెరిగిపోయింది. అధికారంలో ఉన్న వైసీపీలోకి నేతలు ఎవరూ కూడా చూడటం లేదు.

తాజాగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సెన్సెషనల్ అయిన వార్త ఎమన్నా ఉంది అంటే, అది జనసేన పార్టీలోకి వంగవీటి రాధా చేరికే అని చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీ, తర్వాత పీఆర్పీ ,తర్వాత వైసీపీ, ఇలా పార్టీలు జంప్ అయిన రాధా ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్లారు.. సీటు రాలేదు కాని ఎమ్మెల్సీ అనే హామీ వచ్చింది. ఇప్పుడు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీ నడుస్తోంది. మరి ఆయన మాత్రం బీజేపీలో కంటే జనసేన బెటర్ అని ఆలోచించారు. అందుకే ఆయన జనసేనానితో చర్చలు జరిపారు. పవన్ కల్యాణ్ తో భేటీ అయిన ఆయన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చర్చించారట..దీనిపై జనసేన శ్రేణుల నుంచి కూడా విపరీతమైన పాజిటివ్ స్పందనే వచ్చింది..వందలో 90 శాతం రాధా చేరికను ఏకీభవిస్తే ఒక 10 శాతం మాత్రం రాధా చేరికను ఇష్టపడలేదు..అయినా సరే రాధా చేరిక మాత్రం జనసేన పార్టీకు మాత్రం ప్లస్సే అవుతుందని అంతా భావించారు.

ఇక రాధా కూడా మరి పవన్ కల్యాణ్ తో భేటి అయ్యారు.. కాని ఎందుకు పార్టీలో చేరలేదు పవన్ ఏమైనా కండిషన్స్ పెట్టారా..ఇలా అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి . తాజాగా జనసేన నుంచి వస్తున్న వార్తల ప్రకారం..రాధా జనసేనలో చేరేందుకు ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఈ నెలాఖరు వరకు రాధా జనసేన పార్టీలో చేరబోరని తాను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండడంతో ఆ పార్టీకు వచ్చే నెల నాలుగు లేదా ఐదవ తారీఖున చేరేందుకు ప్రణాళిక వేసుకున్నారని సమాచారం. ఆయన వచ్చే నెల మొదటి వారంలో టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతారు అని తెలుస్తోంది. మరి వంగవీటి బాటలో ఇంకెందరు ఉంటారో చూడాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.