గుంటూరు నుంచి మంత్రులుగా ఎవరు? ఇంకెవరు వీరేనా?

YSRCP-Ministers

ఏపీలో ఇప్పుడు వైయస్ జగన్ అధికారంలోకి వచ్చారు.. 30 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు, మరి మంత్రులుగా ఆయన కేబినెట్లో ఎవరు ఉండనున్నారు అంటే ముఖ్యంగా ఆయన పలువురి పేర్లు ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో చెప్పడంతో, వారికి పక్కాగా మంత్రి పదవులు ఇవ్వనున్నారు అని తెలుస్తోంది .. అంతేకాదు ఆయన చెప్పిన వారు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు. ఇప్పుడు ఇదే చర్చించుకుంటున్నారు ఆయా జిల్లాల నేతలు.

ముందుగా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జూన్ 6న ఏపీ కేబినెట్ కూర్పు ఉంటుంది అని చెబుతున్నారు నేతలు. ఈ సమయంలో కొందరి పేర్లు స్పీకర్ గా కూడా వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ గాసిప్స్ అని పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇక గుంటూరులో మరి మంత్రులుగా ఎవరికి అవకాశం ఉంది అనేది చూస్తే,

రాజధాని జిల్లా గుంటూర్ జిల్లా నుంచి వైసీపీ మొత్తం 15 సీట్లు గెలుచుకుంది. అయితే మంగళగిరిలో నారా లోకేశ్పై ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ ఇంతకుముందే ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు మంత్రి పదవి పక్కా, ఆయనకు వ్యవసాయ న్యాయశాఖ ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది.

ఇక మరో వ్యక్తి చిలకలూరిపేటలో విడదల రజినీని గెలిపిస్తే ఎమ్మెల్సీ కోటాలో మంత్రిపదవి ఇస్తానని మర్రి రాజశేఖర్కు జగన్ వాగ్దానం చేశారు. ఇది అప్పుడు ఏపీలో పెద్ద చర్చకు దారితీసింది. అక్కడ పత్తిపాటి ఓటమిపాలయ్యారు, ఇప్పుడు రజనీ అక్కడ విజయం సాధించారు. కాబట్టి మర్రి రాజశేఖర్కి కూడా జగన్ కేబినెట్లో చోటు దక్కేలా కనిపిస్తుంది. ఇక ఎస్సీ, మహిళా కోటలో తనకు మంత్రి పదవి ఖాయమని ప్రత్తిపాడు నుంచి గెలిచిన మేకతోటి సుచరిత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలు అయినా ఆమె పార్టీని వెన్నంటి అంటిపెట్టుకుని ఉన్నారు.

ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ ఆమె ఇప్పుడు ఇక్కడ గెలిచారు.. అందుకే ఆమెకు కూడా కేబినెట్ బెర్త్ జిల్లా నుంచి ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది.. ఇక ఇక్కడ మూడు మంత్రి పదవులు ఫిక్స్ అయ్యాయి, అయితే పార్టీ తరపున సీనియర్ లీడర్ గా ఉన్న వ్యక్తి స్పీకర్ ని సైతం ఓడించిన అంబటి రాంబాబుకు మంత్రి పదవి ఇస్తారా అనే ఆలోచన కూడా వస్తోంది. ఇక్కడకు నాలుగు మంత్రి పదవులు అవుతాయి. ఇక కోన రఘుపతి బాపట్ల నుంచి గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఇస్తే బ్రాహ్మణులకు కూడా పార్టీలో కీలక పోస్టు ఇచ్చినట్లు అవుతుంది అని భావన జగన్ కు ఉంది.

మొత్తంగా ఇక్కడకు ఐదుగురు పోటీలో ఉంటే,  మాచర్ల నుంచి నాలుగు సార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి పేర్లు కూడా జగన్ లిస్టులో ఉన్నట్టు సమాచారం. ఇక అలాగే మైనార్టీ వర్గాల విషయానికి వస్తే  గుంటూరు తూర్పు నుంచి గెలిచిన ముస్తఫా పేరు కూడా జగన్ పరిశీలన చేస్తున్నారు మైనార్టీ కోటాలో, జిల్లాలో 15 సెగ్మెంట్లలో 7 గురు మంత్రి పదవులపై ఆశలుపెట్టుకున్నారు, ఇందులో ఇద్దరికి జగన్ ప్రకటన చేశారు కాబట్టి మరి ఇంకెందరు ఉంటారు కేబినెట్లో అనేది చూడాలి.

విశ్లేషణ-వీజీ

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.