janampulse

తూ.గోలో మంత్రి బోస్ ప్లేస్ లోకి రానున్న మంత్రి ఎవరు ?

pilli subhash chandra bose

ఏపీలో ఇప్పుడు రెండు మంత్రి బెర్తులు ఖాళీ అవుతున్నాయి, అయితే వీటికి ఇప్పుడు రేసు మొదలైంది.. మొన్నటి వరకూ రాజ్యసభ సభ్యులు ఎవరు అని ఆలోచన ఉంటే , ఇప్పుడు ఆ నలుగురిని ఎంపిక చేశారు, అయితే అందులో ఇద్దరు కాబినెట్ మంత్రులు ఉండటంతో మరి ఆ ఇద్దరు కొత్త మంత్రులు ఎవరు రానున్నారు అనే గెస్సింగ్స్ పెరిగిపొయాయి, పైగా ఇందులో ఎవరికి ప్రయారిటీ సీఎం జగన్ ఇవ్వనున్నారు అనేది పెద్ద చర్చ.

రాజ్యసభకు వెళుతున్న మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ… త్వరలోనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు. అయితే వీరు ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారే కావడంతో… ఆ వర్గానికి, ఆ జిల్లాలకు చెందిన వారికే మంత్రులుగా అవకాశం రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. మరి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్లేస్ లో, ఇప్పుడు ఎవరు ఆ మంత్రి పదవి లో ఉంటారు అనే చర్చ జిల్లాలో సాగుతోంది.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే జిల్లాకు చెందిన ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కు అవకాశం ఉండొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఆ ఎమ్మెల్యే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చూపించే రిజల్ట్ ప్రకారం వారికి ప్రయారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు, అయితే బీసీలకు ఇద్దరికి అవకాశం వస్తుంది అనేది పక్కాగా తెలుస్తోంది, జిల్లాలో సీనియర్ గా పొన్నాడకు అవకాశం ఇస్తారు అంటున్నారు, ఆయన వర్గీయులు కూడా ఆశలు పెట్టుకున్నారు, మరి చూడాలి సీఎం జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.