janampulse
Breaking News

హుజూర్‌నగర్ ఫలితాలు విన్న‌ర్ ఎవ‌రు

Who is the winner of Huzurnagar

గులాబీ ప‌రిమ‌ళిస్తుందా
కారు జోరు క‌నిపిస్తుందా
క‌మ‌లం పార్టీ విక‌సిస్తుందా
హ‌స్తానికి ప్ర‌జ‌లు షేక్ హ్యాండ్ ఇస్తారా
సైకిల్ చైన్ ఉంటుందా ఊడుతుందా
క‌మ్యూనిస్టుల మాట‌లు ప్ర‌జ‌లు న‌మ్మారా

ఇలా తెలంగాలో అంద‌రూ హూజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితం గురించి చూస్తున్నారు. కోట్లాది మంది ఈ ఎన్నిక గురించి చూస్తున్నారు, చివ‌ర‌కు ఫ‌లితం రేపు రానుంది. ఈసారి కారు పార్టీ గెలిస్తే గులాబీ గుబాలింపు తెలంగాణ అంతా మ‌రో ఐదేళ్లు ప‌రిమ‌ళిస్తుంది అని చెప్పాలి, వ‌చ్చే గ్రేట‌ర్ మున్సిప‌ల్ పోరులో కూడా స‌త్తా చాటుతారు కేసీఆర్ , ఇక పంతం నెగ్గించుకుని త‌న సీటుని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీకి మ‌ళ్లీ హుషారు వ‌స్తుంది, ఉత్త‌మ్ త‌న కోర్ టీమ్ తో మ‌రో ఐదేళ్లు కేసీఆర్ ని టార్గెట్ చేస్తారు, ఇక తెలంగాణ గడ్డ‌పై బీజేపీ జెండా ఎగుర‌వేయాల‌ని చూస్తున్న కాషాయం పార్టీకి ఇది మంచి వార్మ‌ప్ మ్యాచ్ లాంటిది, ఈ ఎన్నిక ఫ‌లితం అనుకూలంగా వ‌స్తే అసెంబ్లీలో రెండు సీట్లు గెలుచుకుని స‌త్తా చాటాల‌ని చూస్తోంది బీజేపీ, ఇక కేడ‌ర్ లేక విల‌విల‌లాడుతూ ఫెడ‌ల్ లేని సైకిల్ పార్టీ తెలంగాణ‌లో త‌న ఉనికి కోసం పాకులాడుతోంది. ఇక్కడ ప్ర‌జ‌లు టీడీపీ వైపు ఉన్నారా లేదా అనేది తేల‌నుంది, ఇలా ఒక ఎన్నిక ఫ‌లితం వంద ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పనుంది. మ‌రి రేపు ఉద‌యం 8 గంట‌ల నుంచి ఫ‌లితాల‌పై ఆసక్తి క‌నిపిస్తుంది. కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. విన్న‌ర్ ఎవ‌రు లూస‌ర్ ఎవ‌రో చూడాలి, మీ అభిప్రాయం ఏమిటి?

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.