వైసీపీలో మూడు ఎమ్మెల్సీ స్ధానాలు ఎవరికి దక్కుతాయి

Who owns three MLC locations in YCP

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం కొత్తగా ఎమ్మెల్సీల అవకాశం కల్పించనుందనే విషయం.. ఈ అవకాశం కోసం చాలా మంది నేతలు ఎదురుచూస్తున్నారు. మరి జగన్ ఎవరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారు అని చర్చ నడుస్తోంది. సీఎం మదిలో ఇప్పటికే ఇద్దరి పేర్లు ఉన్నాయి అని తెలుస్తోంది.. మరో సీటు గురించి ఆలోచన ఎందుకు అంటే ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ స్ధానాలు భర్తీ చేయాల్సిన సమయం.

మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో మూడింటిని భర్తీ చేయాల్సి ఉంది. ఆ మూడింటిలో ఒకటి మోపిదేవి వెంకటరమణకు, ఇంకోటి మైనారిటీ నేత ఇక్బాల్ కు దక్కడం ఖాయం, మిగిలిన ఒక్క స్థానాన్ని జగన్ ఎవరికి ఇస్తారు అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ అలీకి ఇస్తారు అనే చర్చ ఉన్నా ఆయనకు ఇవ్వరు అని చెబుతున్నారు. ఎందుకు అంటే రెండు మైనార్టీ నేతలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే జగన్ మరోసారి కచ్చితంగా ఎమ్మెల్సీ అవకాశం అలీకి ఇవ్వాలి అని చూస్తున్నారు.

ఇక ప్రకాశం జిల్లా నుంచి దర్శి నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బూచేపల్లి శివప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది.. ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.. అలాగే నెల్లూరు జిల్లా నాయకుల్లో ఎవరికైనా ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. ముందుగా నేదురుమల్లి రాంకుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా ఆనం రాంనారయణరెడ్డి గెలుపు కోసం కృషి చేశాడు కాబట్టి ఆయనకే ఇస్తారని ఒకవైపు వార్తలు వస్తుండగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ మీద ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.. పైగా జిల్లాలో ఎంతో మంచి రికార్డు వైసీపీ సంపాదించింది. అలాగే పాలకొల్లు నుంచి ఈసారి డాక్టర్ బాబ్జికి జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు , ఆయన ఓటమి పాలయ్యారు. ఆయనకు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు. మరి పార్టీలో ఎంతోకాలంగా సీనియర్లు ఉన్నారు కాబట్టి, ఆయన పేరుని పక్కన పెట్టే అవకాశం ఉంది అని చెబుతున్నారు కొందరు జిల్లా నేతలు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.