
అసలు బీఎస్ 6 వాహనాలు ఎందుకు ? దాని చరిత్ర
ఇప్పుడు ఎక్కడ చూసినా మార్కెట్లో బీఎస్ 6 వాహనాలు వస్తున్నాయి అని అందరూ చర్చించుకుంటున్నారు …ఏప్రిల్ నుంచి ఈ వాహనాలు ఇక రోడ్లపైకి రానున్నాయి, ఇక ఇవే మార్కెట్లో అమ్మాలని సుప్రీం కోర్టు కూడా సూచించింది. ఇప్పుడు ప్రస్తుతం బీఎస్–4 వాహనాలు కంపెనీలు అమ్ముతున్నాయి, అవి ఈనెలాఖరున ఆపేయాలి.. అయితే ఇప్పుడు కొత్త వాహనాలు ఎందుకు అంటే, ఇలా మనం వాడే వాహనాల నుంచి వచ్చే వాయు కాలుష్య ఉద్గారాలను బట్టి, ఇంజన్ మోడల్ను ప్రతిపాదిస్తున్నారు.
దీన్నే భారత్ స్టాండర్డ్ వాహనాలుగా చెబుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు బీఎస్–2,3,4.. వచ్చాయి .తాజాగా బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. 2001 నుంచి 2005 మధ్యలో బీఎస్–2 వాహనం రోడ్లపై వచ్చాయి. తర్వాత 2005లో బీఎస్–3 వాహనాలు మార్కెట్లోకి వచ్చింది. 2017లో బీఎస్–4 వచ్చింది, ఇప్పుడు ఏప్రిల్లో బీఎస్–6 వాహనం అందుబాటులోకి వచ్చింది అంతేకాదు దీని ఇంజిన్ సామర్థ్యం మెరుగ్గా ఉండి వేగం తగ్గకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రధానంగా కాలుష్యం తక్కువగా వదిలే విధంగా దీన్ని తయారు చేశారు.
వీటిలో మైలేజ్ పరంగా 15 శాతం అధికంగా ఉన్నా ట్యాంకులో 2 నుంచి 3 లీటర్లు నిల్వ ఉంచుకుంటేనే వాహనం నడుస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బీఎస్–6 వాహనాలకు పెట్రోల్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్ నాటికి ఈ ఇంధనం పెట్రోల్ బంకులోకి అందుబాటులోకి రానుంది. అయితే ఈ పెట్రోల్ బీఎస్–4 వాహనాలకు కూడా వాడే విధంగా తయారు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్