
జాక్ పాట్ కు దగ్గరగా ఎమ్మెల్యే విడదల రజని
ఆమె రాజకీయాలకు కొత్త …పైగా తొలిసారి ఎమ్మెల్యే.. మాజీ మంత్రిని సైతం ఓడించి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు ఆమె చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ.. అయితే తాజాగా ఆమె గురించి పొలిటికల్ సర్కిల్స్ లో ఓ వార్త వినిపిస్తోంది. అన్నీ కలిసొస్తే ఆమె జగన్ కేబినెట్లో మంత్రి అవుతారనే ప్రచారం కూడా మొదలైంది. దీనికి కారణం కూడా ఉంది.
ఏపీలో కేబినెట్ మంత్రులు ఇద్దరిని రాజ్యసభకు పంపించారు సీఎం జగన్, ఈ సమయంలో జిల్లా నుంచి మోపిదేవి వెంకటరమణ కూడా ఉన్నారు ..ఆయన బీసీ నాయకుడు. 2019 ఎన్నికల్లో ఆయన రేపల్లెనుంచి పోటీ చేశారు.. కాని ఓటమిపాలయ్యారు.. దీంతో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్.
అయితే జిల్లా నుంచి మోపిదేవి మంత్రి పదవికి రాజీనామా చేస్తారు, ఇలా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సామాజికవర్గాల సమీకరణాల ప్రకారం ఖాళీ అయ్యే రెండు స్థానాలూ బీసీలకు చెందినవే. బీసీలకు పెద్దపీట వేస్తానని ప్రకటించిన సీఎం జగన్ ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు కోల్పోయిన 10 శాతం రిజర్వేషన్ను పార్టీ తరఫున అమలు చేయాలని నిర్ణయించారు. అందుకే జిల్లా నుంచి విడదల రజనీ పేరు వినిపిస్తోంది, అయితే ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి.
గుంటూరు జిల్లాలో ఇంత మంది సీనియర్లు ఉన్నా ఆమె పేరు ఎందుకు వినిపిస్తుంది అంటే.. మిగిలిన వారు రెడ్డి కమ్మ కాపు ..అందుకే ఆమె పేరు వినిపిస్తోంది,…విడదల రజిని మాత్రమే బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ. ఒకవేళ ఎవరైనా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి మరో ఏడాదిన్నర పాటు మాత్రమే పదవి ఉంటుంది. రెండున్నరేళ్ల తర్వాత మరో కొత్త టీమ్ వస్తుందని తొలిసారి మంత్రివర్గ ప్రమాణస్వీకారం సమయంలోనే జగన్ ప్రకటించారు. సో అందుకే అప్పుడు ఎప్పుడో వచ్చే పదవి కంటే, ఇప్పుడు వచ్చే పదవి బెటర్ అని, మంత్రిగా ఆరు నెలలు చేసినా చాలని ఆమె వర్గం చెబుతున్నారు, చూడాలి ఈక్వేషన్లు అన్నీ ఒకే అయితే ఆమెకే ఛాన్స్ లు ఉన్నాయి అంటున్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్