మాజీ స్పీకర్ కోడెలకు వైసీపీ కౌంటర్

kodela-shivaprasad

ఇప్పుడు గుంటూరు జిల్లాలో కోడెల బాధితులు వరుసపెట్టి పోలీస్ స్టేషన్ వద్ద క్యూ కడుతున్నారు.. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కోడెల శివప్రసాదరావు, కోడెల శివరాం, విజయలక్ష్మి సాగించిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలపై పెత్తనం చెలాయించారు. విలువైన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి రూ.కోట్లు దండుకున్నారు. ల్యాండ్ కన్వర్షన్, అపార్ట్మెంట్ల అనుమతుల వ్యవహారంలో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. కే ట్యాక్స్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. ఇది కోడెల కుటుంబం పై అక్కడ ప్రజలు చేస్తున్న విమర్శలు.. ముఖ్యంగా ఇవన్నీ కూడా పోలీసుల ముందు చెబుతున్నారు బాధితులు ఒక్కొక్కరుగా వారు బయటకు వస్తున్నారు.

 ఇక నరసరావుపేట సత్తెనపల్లిలో ఇలాంటి దారుణాలు చాలా జరిగాయి అని చెప్పారు బాధితులు.. పోలీసులు కూడా వీటిపై విచారణచేస్తున్నారు.. ఇక దీనిపై మాజీ స్పీకర్ కోడెల మీడియా ముందుకు వచ్చారు, రెండు రోజులుగా తన కుటుంబం పై కావాలనే టార్గటె్ చేశారు అని అన్నారు. బెదిరించి కేసులు పెట్టడం సమంజసం కాదు అని చెప్పారాయన. తన కుటుంబాన్ని టార్గెట్ చేసి ఏడు కేసులు పెట్టారు అని ఇంకా చాలా కేసులు పెట్టేలా ఉన్నారు అని అంటున్నారు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కావాలని రెచ్చగొట్టి మరీ మా కుటుంబం పై కేసులు పెట్టండి అని చెబుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు గ్రామాలను విడిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి స్పీకర్ గారు చెప్పిన మాటలపై వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు.. మీరు తప్పు చేయకపోతే మరి కేసులు ఎందుకు నమోదు అవుతున్నాయి? వాయిస్ కాల్ లిస్టులతో సహా అన్నీ పోలీసులు బయటపెట్టి ఇదే మీడియా ముందు తెలియచేస్తారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.. ఇప్పుడు ఏ మీడియా ముందు వచ్చిమీరు తప్పు చేయలేదు అని సమర్దించుకుంటున్నారో ,అదే మీడియా ముందు రేపు మాట్లాడవలసి వస్తుందని నిజాలు వాస్తవాలు త్వరలో తెలుస్తాయని అంటున్నారు వైసీపీ నేతలు. నిజంగా కోడెల ట్యాక్స్ కట్టకపోతే వారు ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు ఆధారాలు సాక్ష్యాలు ఎలా చూపిస్తున్నారు..

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.