janampulse

పోలవరానికి జగన్ @27 న ఏం చేయబోతున్నారు

YS Jagan at Polavaram Project tour

ప్రతీ వారం పోలవరం పర్యటన.. ఇదే ఆనాడు బాబు చేసిన హడావిడి.. అక్కడ పర్యటనలకే కోట్లు ఖర్చుచేశారు అని చెప్పాలి, కాని పనులు మాత్రం వేగవంతం చేయలేదు, ఇక వైయస్ జగన్ తాజాగా ఈ పోలవరం ప్రాజెక్ట నిర్మాణం ఎలాగైనా పూర్తి చేయాలి అని చూస్తున్నారు, అంతేకాదు పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకున్నాయి.గతంలో వచ్చిన వరద ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం, ఇతర వ్యవహారాలూ ఒక కొలిక్కి రావడంతో.. కీలకమైన స్పిల్ వే నిర్మాణం పనులు ఊపందుకున్నాయి.

గత ప్రభుత్వం కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ప్రాధాన్యతను ఇచ్చారు.. ఇది పూర్తి అయితే మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయినట్లే అని చెప్పారు.. కాని ఇది వాస్తవం కాదు అనేది అధికారులు చెబుతున్నారు .గత ఏడాది విపరీతమైన స్థాయిలో వరదలు రావడంతో, కాఫర్ డ్యామ్ నిర్మిత ప్రాంతమంతా భారీగా వరదనీటితో నిండిపోయింది. అది మెయిన్ పనులకి బాగా ఆటంకం ఏర్పరచింది.

ఇక కాపర్ డ్యామ్ ముందుగా నిర్మించడం వల్ల వచ్చిన తప్పిదం అని ఇంజనీర్లే చెబుతున్నారు …. వర్షాలు తగ్గిపోయిన చాన్నాళ్లకు కూడా పనులు మళ్లీ మొదలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కీలకమైన స్పిల్ వే నిర్మాణం జరుగుతూ ఉంది. స్పిల్ వేలో ఒక్కో బ్లాక్ ఎత్తు దాదాపు 52 మీటర్లు అని తెలుస్తోంది. ఈ మేరకు స్పిల్ వే పియర్స్ నిర్మితం అవుతున్నాయి.

ఇక్కడ వేగంగా ప్రాజెక్ట్ పనులు జరుపుతున్నారు.ఇక ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికి అయినా కీలకం వేసవి కాలం..ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ.. పోలవరం పనులకు సంబంధించిన కీలకమైన సమయం అని అడుగులు పనులు ముందుకు వేస్తున్నారు… ఈ నెలల్లోనే స్పిల్ వే నిర్మాణ పనులను పూర్తి చేయడానికి శరవేగంగా పనులు చేయాలని సంకల్పిస్తూ ఉన్నారు. మళ్లీ వర్షాలు వచ్చే సమయానికి దాదాపు 70 శాతం పని పూర్తి చేయాలి అని చూస్తున్నారు…. 2021 ఆగస్టు నాటికి ఫినిషింగ్ చేయాలి అని చూస్తున్నారు.

మన ఏపీకి ఇది జీవనాడిగా చెప్పాలి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగు నీరు అందుతుంది, 80 టీఎంసీలను కృష్ణకు తరలించవచ్చు, ముఖ్యంగా గోదావరి డెల్టాలో 13 లక్షల ఆయకట్టును రబీలో స్థిరీకరించడం చేయవచ్చు, విశాఖకు 23 టీఎంసీల తాగునీటిని అందించవచ్చు, అందుకే ఇంత పెద్ద ప్రాజెక్ట్ గా దీనిని చెబుతారు. ..ఈ నెల 27న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం సందర్శనకు వెళ్తూ ఉన్నారు… పనులు వేగవంతం చేయాలని.. అలాగే జరిగిన పనిపై అక్కడ ప్రత్యక్షంగా చూడాలి అని సీఎం జగన్ నిర్ణయించారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.