janampulse

మంత్రి పదవి రేసులో ముగ్గురు ఒకరికి కన్ఫామ్

YS Jagan cabinet expansion

ఏపీలో అనుకోని రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి అనే చెప్పాలి… శాసన మండలి రద్దు చేయడంతో ఇద్దరు మంత్రుల పదవులు మరో ఇద్దరితో భర్తీ చేయాలి.. అయితే వారిద్దరికి రాజ్యసభ అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్.. ముఖ్యంగా తూగో జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి వెంకటరమణారావును రాజ్యసభకు ఎంపిక చేశారు.

అయితే ఈ రెండు పదవులు ఇప్పుడు ఎవరికి రానున్నాయి అని అందరూ చర్చించుకుంటున్నారు.. జిల్లాలో మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.రెండో మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఉన్నారు. అయితే ఆర్కే కి కచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని ఆలోచన చేస్తున్నారు అందరూ.

ముందు కచ్చితంగా ఆయనకు బెర్త్ కన్ఫామ్ అని అనుకున్న సమయంలో ఆయనకు మంత్రి పదవి రాలేదు, పైగా లోకేష్ ని ఓడించినా సరే ఆయనకు మంత్రి పదవి రాలేదు అని ఆయన అభిమానులు కూడా కాస్త ఖంగుతిన్నారు.

తాజాగా ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చారు, అది కూడా జగన్ ఆలోచించి ఆర్కేకి పదవిని డిసైడ్ చేయనున్నారు, ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కీలకనేత, సిట్టింగ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించటం తో ఎమ్మెల్యే రజనీకి కూడా మంత్రి అవకాశాలు ఉన్నాయి, మొత్తానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.