janampulse

మంత్రి గౌతమ్ రెడ్డికి మరిన్ని శాఖలు అప్పగించిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరిన్ని శాఖలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి తెలియచేశారు… ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, జౌళి, ఐటీ శాఖల బాధ్యతల్ని నిర్వహిస్తున్న మేకపాటికి.. ఇప్పుడు అదనంగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖలను కేటాయించారు. తాజాగా దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఆయన మంత్రిగా ముందుకు దూసుకుపోతున్నారు.ఈ సమయంలో ఆయనకు మరిన్ని శాఖలు అప్పగించినా పని చేయగలరు అని నమ్ముతున్నారు సీఎం జగన్.. అందుకే ఆయనకు మరిన్ని శాఖలు అప్పగించారు.. ఈ సమయంలో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. తనకు అదనపు బాధ్యతల్ని అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు..

ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ద్వారా ప్రభుత్వంపై యువతకు ఉన్న విశ్వాసాన్ని పెంచేలా పనిచేస్తాను అన్నారు. ఉపాధి, నైపుణ్య శిక్షణలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర యువత ఆలోచనలు ప్రతిబింబించేలా ముందుకువెళతానని చెప్పారు మంత్రి… నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తాము అన్నారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖలు కూడా పరిశ్రమలకు అనుబంధం కావడంతో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పొలిటికల్ గా చూస్తే గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు…గౌతమ్రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డి.. ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.. కానీ ఆయన 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు… ఈ సమయంలో గౌతమ్ రాజమోహన్రెడ్డి రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.