అసెంబ్లీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను పులకించిన సభ

jagan-swearing

ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే పిలుపు బాగా వినిపించింది. ప్రమాణస్వీకారం రోజు ముఖ్యంగా జగన్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున ఈ పిలుపు మార్మోగిపోయింది… అయితే అలాంటి రోజు నేడు మరోసారి వచ్చింది, ఇంతకీ దేనికి అనుకుంటున్నారా. ఎంతో అట్టహాసంగా మొదలయిన శాసన సభా సమావేశాలలో కూడా మరో మారు వై ఎస్ జగన్ అనే నేను మాట వినిపించడంతో అందరూ ఆనందంగా ఉన్నారు. వైసీపీ నేతలు కూడా చప్పట్లతో ఆనందం పంచుకున్నారు.. టీవీలలో చూసి ఇలాంటి మరో రోజు మే 30 తర్వాత ఈరోజు వచ్చింది అంటున్నారు వైసీపీ నేతలు. మే 30న ఆయన ప్రమాణస్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ఇది తెలిసిందే.

ముఖ్యమంత్రిగా జగన్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.9 సంవత్సరాల పాటు పడిన కష్టానికి నేడు గుర్తింపు దక్కింది. జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టి ఈరోజు ఇంత పెద్ద పదవిని ఇచ్చారు జగన్ కు..ముఖ్యమంత్రిగా ప్రొటెం స్పీకర్ అయినటువంటి సంబంగి చిన అప్పలనాయుడు నేతృత్వంలో మొదటి వ్యక్తిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు.ఆ తర్వాత ఇతర పార్టీల శ్రేణులు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసారు.. జగన్ తర్వాత చంద్రబాబు చేయగా తర్వాత 5గురు డిప్యూటీ సీఎంలు చేశారు. తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఇరు పార్టీల నేతలు ఒక్కొక్కరుగా ప్రమాణస్వీకారం చేశారు. నేటితో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు ప్రొటెం స్పీకర్.

ఇక జగన్ కూడా వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు అందరికి అభివాదం చేసుకుంటూ పోడియం దగ్గరకు వెళ్లారు. అక్కడ తెలుగుదేశం నేతలకు కూడా ఆయన అభివాదం చేశారు, మొత్తానికి జగన్ సింప్లిసిటీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి కేబినెట్ కూర్పు జగన్ ఏపీలో చేశారు, అందుకే జగన్ కు ప్రజలు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.