నారాయణ ఎంట్రీకి జగన్ నో రీజన్ ఇదే

YS Jagan not intrested to enter Narayana YCP

ఏపీలో జగన్ అధికారంలోకి రావడం ప్రజలకు ఆనందంగా ఉన్నా, తెలుగుదేశం నేతలు ఓడిపోయాము అనే బాధకంటే జగన్ గెలిచారు అనే బాధతో వర్ణించలేనంతగా ఉన్నారు.. ఎవరైనా సరే టీడీపీ నేతల మెఖంలో ఈ కల కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే టార్గెట్ చేయాల్సిన అవసరం వైసీపీ నేతలకు ఆ ప్రభుత్వానికి లేదని, మీరు ఐదు సంవత్సరాల పాలనలో చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి అని అంటున్నారు వైసీపీ నేతలు. ఇదే టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అంతా తానే అన్నట్లు వ్యవహరించారు మాజీమంత్రి నారాయణ. ఫలితాలొచ్చిన తర్వాత అసలు కంటికి కనిపించకుండా మాయమైపోయారు. ఆయన విద్యా సంస్ధల వ్యాపార ప్రకటనలు మీడియాలో వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయికాని, ఆయన మాటలు మీడియాలో వినిపించడం లేదు. బాబు అధికారంలో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ బాబుకు దగ్గర వ్యక్తిగా ఆయన ఉన్నారు. సీఆర్డీయే వ్యవహారాలు కూడా ఆయనే చక్కబెట్టారు. ఇక ఓటమిపాలైన తర్వాత ఆయన గురించి ఎక్కడా కూడా చర్చ మాత్రం జరగడం లేదు. ఇక జిల్లా నేతలకు కూడా ఆయన అందుబాటులో లేరట.. ఆయన హైదరాబాద్ లో బిజీ బిజీగా ఉన్నారు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారట.

సీఆర్డీయే పరిధిలో అంతా నారాయణ చంద్రబాబు లోకేష్ అనే పేర్లు మాత్రమే వినిపించాయి. కాని ఇప్పుడు నారాయణ మాత్రం టీడీపీ ఓటమితో ఆలోచనలో ఉన్నారు. ఆయన వ్యాపారాల్లో ఉన్నారు, పైగా అంతా విద్యావ్యాపారం, ఇప్పుడు జగన్ విద్యా వ్యవస్ధలో అనేక కొత్త మార్పులు తీసుకువస్తున్నారు. ఇక ఆయన బీజేపీలోకి వెళ్లాలి అని భావించినా మళ్లీ వైసీపీ వైపు రావాలి అని మనసు మార్చుకున్నారు అనే వార్తలు నెల్లూరులో వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు కూడా వ్యాపారాలు చేసుకునే రాజకీయ నేతలను వదిలేస్తున్నారు. అక్కడ రాజ్యసభ సభ్యులని అంబికా కృష్ణని కూడా వదిలేశారు. ఇప్పుడు కూడా అలాగే వదిలేస్తున్నారు అని అంటున్నారు నేతలు.

ఇక అందరి కంటే ఆయన పేరు ఇప్పుడు సీఆర్డీయే పరిధిలో వినిపిస్తోంది, పైగా ఎమ్మెల్యేగా గెలవలేదు కాబట్టి నేరుగా వైసీపీలో చేరిపోవచ్చు. జగన్ అయితే ఎమ్మెల్యేగా గెలిచిన వారు పార్టీలోకి వస్తే రాజీనామా చేయాలి అన్నారు. నారాయణకు ఇలాంటి బాధలు ఏమీ లేవు. కండువా సైకిల్ పై వేసి ఫ్యాన్ కింద కూర్చొవచ్చు .. కాని జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా కూడా ఉన్నారు. పైగా నారాయణ లాంటి వ్యాపార రాజకీయ నేతని చేర్చుకోవడం పార్టీకి మైనస్ అని ఆలోచించారు.. సో జగన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. పైగా గత ఐదు సంవత్సరాల్లో నారాయణ విద్యాసంస్ధలపై అనేక విమర్శలు జగన్ చేశారు. ఈ సమయంలో అదే నారాయణ పార్టీలోకి వస్తే ఎలాంటి పరిస్దితి వస్తుందో అనేది జగన్ ఆలోచన, అందుకే నారాయణకు వైసీపీలోకి నో ఎంట్రీ చెప్పారట.. ఇప్పుడు నెల్లూరులో నయా టాక్ ఇదే.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.