చంద్రబాబు తన తప్పును ఒప్పుకునేలా చేసిన జగన్

YS Jagan of Chandrababu admitting his mistake

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొత్తానికి ఐదురోజుల పాటు జరిగాయి .. తొలి సమావేశాలు ఇంత హాట్ హాట్ గా జరిగే సరికి అందరూ కూడా వీటి గురించే చర్చించుకున్నారు.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా చంద్రబాబు ప్రతిపక్షంలో చాలా ఇబ్బందిగా ఉన్నారు అని అంటున్నారు.. మొత్తానికి వారు అధికారంలో ఉన్న సమయంలో జగన్ పై ఎలాంటి విమర్శలు చేశారో మాట్లాడడానికి అవకాశం ఎలా ఇవ్వలేదో అన్ని అంశాలు కూడా వైసీపీ ఇప్పుడు పట్టించుకుంటోంది.. కాని జగన్ మాత్రం చంద్రబాబు మాట్లాడుతాను అంటే, ప్రతిపక్ష నాయకుడి హోదాలో బంగారంగా మాట్లాడటానికి సమయం ఇస్తాం అని చెబుతున్నారు.

ఇక మూడు రోజులుగా జరిగిన చర్చ ఒకటే స్పీకర్ ని ఎన్నుకున్న రోజు నుంచే తొలిరోజు నుంచే వివాదం మొదలైంది. ఇక్కడ నుంచి ఈసారి ఈ ఇద్దరు నేతల మధ్య పార్టీల మధ్య వార్ స్టార్ట్ అయింది అని చెప్పాలి.. స్పీకర్గా తమ్మినేని సీతారాంని ఎన్నుకున్నప్పుడు ఇరు అధికార, ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కలిసి మర్యాద పూర్వకంగా స్పీకర్ కుర్చీ వరకు ఆయనను ఆహ్వానించాలి. ఇది సంప్రదాయం కాని జగన్ మాత్రమే సీఎంగా అక్కడకు వచ్చారు…ఇటు ప్రతిపక్షం నుంచి చంద్రబాబు రావాలి కాని ఆయన మాత్రం రాకుండా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పంపించారు. అయితే తాను రాకపోవడానికి కారణం మాత్రం తనని పిలవలేదు. అలాగే తమను సంప్రదించలేదు పిలవని పేరంటానికి ఎలా వస్తాం అధ్యక్షా అని చంద్రబాబు నేరుగా స్పీకర్ కు చెప్పుకున్నారు.

ఇక తాను రాకుండా చంద్రబాబు తన బంట్రోతులను పంపాడు అని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సభ మొత్తం గందర గోళంగా మారిపోయింది. అయితే ఇక ఐదవరోజు మాత్రం డిప్యూటీ స్పీకర్ ని ఎన్నుకోవడం ఆయనని మర్యాదపూర్వకంగా సభాపతి స్ధానంలో కూర్చొబెట్టారు..కోన రఘుపతి పేరు చెప్పగానే ఇటు సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఇద్దరూ వచ్చి ఆయనని మర్యాదపూర్వకంగా స్పీకర్ కుర్చీలో కూర్చొబెట్టారు.. ఇప్పటికే స్పీకర్ ని ఇలా మర్యాదగా కూర్చొబెట్టడంలో తాను ముందుకు రాకపోవడంలో వైసీపీకి అస్త్రంగా మారాను అని భావించిన చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్ విషయంలో ఇలా ముందుకు వచ్చారు అని అంటున్నారు. మొత్తానికి ప్రతిపక్ష నేత చంద్రబాబుకి తన తప్పు తెలుసుకునేలా జగన్ చేస్తున్నారు అని అంటున్నారు వైసీపీ నేతలు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.