చంద్ర‌బాబు రెండు సినిమాల పై జ‌గ‌న్ అదిరిపోయే కౌంట‌ర్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తూర్పుగోదావ‌రి ప్ర‌జ‌లు అశేషంగా నీరాజ‌నాలు ప‌లికారు,జ‌న  స్వాగ‌తాల‌తో జ‌న‌నేత   తూగోలో ప్ర‌వేశించారు..
187వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాజమహేంద్రవరం శ్యామల థియేటర్‌ సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్నజ‌గ‌న్ అధికార తెలుగుదేశం పార్టీకి కౌంట‌ర్లు వేశారు.. చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్ట్ గురించి చెప్పేవి అన్నీక‌బుర్లే అని ఆయ‌న ఫైర్ అయ్యారు.
నాడు వైయ‌స్ హ‌యాంలో పోల‌వ‌రం ప‌రుగులు పెడితే, నేడు చంద్ర‌బాబు నాలుగేళ్ల‌ప‌రిపాల‌న‌లో పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయ‌ని విమ‌ర్శించారు ఆయ‌న‌.
ఒకే ప్రాజెక్టుకు ఆరుసార్లు శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని, మోసాలు చేయడంలో పీహెచ్‌డీ చేసిన చంద్రబాబు..శంకుస్తాప‌న ప‌నులు ప్రారంభించ‌గానే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం హ‌స్యాస్ప‌దం అన్నారు..పోల‌వ‌రం పై గ‌తంలో 9 సంవ‌త్స‌రాలు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఎందుకుప‌ట్టించుకోలేదు అని ప్ర‌శ్నించారు జ‌గ‌న్..చంద్ర‌బాబు మ‌న‌కు రెండు సినిమాలు చూపించార‌ని ఒక‌టి అమ‌రావ‌తి అయితే రెండు పోల‌వ‌రం అని ఆయ‌న ఫైర్ అయ్యారు.. అమ‌రావ‌తి ఏ దేశం వెళితే అలాగే క‌డ‌తాను అని గ్రాఫిక్స్ చూపించార‌ని, మ‌రోక‌టి పోల‌వ‌రం అని ఆయ‌న రెండు సినిమాల‌పై కౌంట‌ర్లు వేశారు.
.పోల‌వ‌రం ప‌నులు  నాడు వైయ‌స్ ఉన్న స‌మ‌యంలోనే ఎడ‌మ కుడికాలువ‌ల ప‌నులు90 శాతం పూర్తి అయ్యాయ‌ని ఆయ‌న తెలియ‌చేశారు..ఈ రెండింటిలో క‌మీష‌న్లు దండుకోవ‌డ‌మే అధికార పార్టీ ప‌నిగా ఉంద‌ని అన్నారు…రాజమహేంద్రవరంలో వైఎస్సార్‌ 8 వేలకు పైగా ఇళ్లు కట్టించారు. 36 ఎకరాలు సేకరించి 26 ఎకరాల్లో ఇళ్లు కట్టించి పేదలకు ఇచ్చారు వైఎస్సార్‌. మిగిలిన 10 ఎకరాలను పేదలకు పంచిన గొప్పవ్యక్తి వైఎస్సార్‌. కానీ ఆ 10 ఎకరాలను చంద్రబాబు లాక్కున్నారని పేదలు వాపోతున్నారు.
ఇదేనా చంద్ర‌బాబు పాల‌న అని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక్క‌డ 18 సీట్లు నాన్న‌గారికి గ‌తంలో విజ‌యంగా ఇచ్చారు.. అలాగే జిల్లాలో నాడు నాన్న వైయ‌స్ ఎన్నో ప‌ధ‌కాలు అమ‌లు చేశారు అని ఆయ‌న తెలియ‌చేశారు. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో ఏం చేశారు. అవినీతిలో ఏపీ నెంబర్‌ వన్‌ అని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. చంద్రబాబు కంటే బిహార్‌ రాష్ట్రమే బెటర్‌ అని మకియ సంస్థ చెప్పింది. అని జ‌గ‌న్ విమ‌ర్శించారు.
ఎక్కడైనా సరే ఆపరేషన్‌ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కిందకు తెస్తాం,డయాలసిస్‌, తలసేమియ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల ఫించన్‌ ఇస్తామని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు మ‌న ప్ర‌భుత్వం పేద‌ల ప్ర‌భుత్వంలా ప‌నిచేస్తుంద‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.