janampulse

వైయస్ భారతికి ఈ పని జగన్ అప్పచెప్పారా

YS Jagan work was handed over to YS Bharati

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇక విశాఖ నుంచి పరిపాలన చేయనున్నారు, కార్యాలయాల తరలింపు కూడా జరుగనుంది, అయితే ఇప్పటి వరకూ సీఎం కార్యాలయం గురించి చర్చ జరిగింది, అయితే ఆయన ఇల్లు ఎక్కడ తీసుకుంటారు అనేదానిపై మరో వార్త వినిపిస్తోంది.. తాజాగా సీఎం జగన్ భార్య వైయస్ భారతీ విశాఖకు వచ్చారు.

అయితే ఆమె చాలా సార్లు విశాఖకు వచ్చారు కాని ఈ సారి విశాఖ టూర్ లో మెయిన్ అజెండా ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి ఇళ్లు చూడాలి అని వచ్చారట, అయితే ప్రభుత్వం తరపున అందుబాటులో ఉన్న ఇళ్లు ఏమిటి అనేవి ఇప్పటికే చూశారు.
అందుకే కొన్ని ఫైనల్ చేసి వాటిని సీఎం జగన్ సతీమణి వైయస్ భారతీకి చూపించారట…నౌకాశ్రయ గెస్ట్ హౌస్ తో పాటు.. రుషికొండలోని కొన్ని విశాలమైన భవనాల్ని చూపించారు. భీమిలిలోని జూట్ మిల్ గెస్ట్ హౌస్ ను కూడా చూపించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు రెండు మూడు విల్లాలను భీమిలీలో చూపించారు అని తెలుస్తోంది.

అన్నీ ప్రాంతాలకు సులువుగా చేరుకునే విధంగా సిటీకి మధ్యలోనే చూపించారట, కాని వాటిని వైయస్ భారతీ ఫైనల్ చేయలేదు అని వార్తలు అయితే వస్తున్నాయి, మరికొన్ని ఇళ్లను చూసే పనిలో ఉన్నారు అధికారులు, మొత్తానికి జగన్ కు కూడా తన సతీమణికి నచ్చితే ఆ ఇంటిని ఫైనల్ చేస్తారు అని అంటున్నారు.. నిజమే సింప్లిసిటీగా ఉండే సీఎం జగన్ సాధారణ ఇంటినే చూడమన్నారట, నాయకులు వస్తూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్లు ఇంటిని చూస్తున్నారు, అంతేకాదు ఆయన పరిపాలనతో భీజీగా ఉన్నారు కాబట్టి ఈ పనిని వైయస్ భారతీకి అప్పగించారు అని అంటున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.