
పాదయాత్రకు తండ్రి ఆశీస్సుల కోసమే..ఇడుపులపాయకు వైఎస్ షర్మిల
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మంగళవారం ఉదయం ఇడుపులపాయ రానున్నారు. చేవెళ్ల నుంచి ప్రారంభించే పాదయాత్రకు ఆమె తండ్రి, దివంగత
వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రేపు ఉదయం ఇడుపులపాయ రానున్నారు. వైఎస్సార్ టీపీ అధికార ప్రకటన చేసి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20వ తేదీన తన తండ్రి సెంటిమెంట్‌గా భావించే చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్రకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రేపు ఇడుపులపాయలో తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. వైఎస్ షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా ఇడుపులపాయకు రానున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయ చేరుకుంటారు. వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. సాయంత్రం తిరిగి ఇడుపులపాయ నుంచి కడప ఎయిర్ పోర్టుకు వెళ్లి విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.
ఈ నెల 20 నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో ప్రారంభించే పాదయాత్రలో రోజూ 10 నుంచి 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారం రోజులు, ఆ తరువాత ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి యాత్ర సాగుతుంది. తొలి రోజు చేవెళ్లలో సుమారు లక్ష మంది పాల్గొనేలా అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నట్లు సమాచారం. పాదయాత్రకు సంబంధించి స్పీచ్, యాత్రలో ఏయే అంశాలు ప్రస్తావించాలనే విషయాలపై షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీమ్ పలుమార్లు సమావేశమై చర్చించింది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్