
జగన్ బర్త్ డే సందర్భంగా అరుదైన ఫీట్..వైసీపీ కార్యకర్తల సరికొత్త రికార్డ్
ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏపీ ముఖ్యమంత్రి YS JAGAN పుట్టినరోజు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,745 మంది రక్తదానం చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ప్రతినిధి జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శాప్‌చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ముందుగా రక్తదానం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా 2019లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 2,043 మంది రక్తదానం చేశారు. ఆ తర్వాత ఏడాది (2020)లో 2,143 మంది రక్తదానం చేశారు. ఈ ఏడాది 2,745 మంది రక్తదానం చేసి సరికొత్త రికార్డు నమోదు చేశారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బర్త్ డే వేడుకలను అభిమానులు ఘనంగా చేపట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున సంబరాలు, కేక్ కటింగ్స్ చేస్తున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్