
చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
సోషల్ మీడియాలో టీడీపీ నేత పెట్టిన పోస్ట్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు స్పందించారు. ఎమ్మెల్యే నందూమరి బాలయ్య ఇంటి ముట్టడికి ఆ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు.
Anantapur district హిందూపురంలో బాలయ్య ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. డంపింగ్ యార్డు విషయంలో వైసీపీ, టీడీపీల మధ్య వివాదం మొదలైంది.. దీనిపై సోషల్ మీడియాలో టీడీపీ నేత పెట్టిన పోస్ట్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు స్పందించారు. బాలయ్య ఇంటి ముట్టడికి ఆ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని అడ్డుకున్నారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఇంటిని ముట్టడిస్తారా అంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
టీడీపీ నేతలు రెచ్చగొట్టే వైఖరితో ఉన్నారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. అభివృద్ధిపై టీడీపీ చేసిన సవాల్‌ను స్వీకరించి వచ్చామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ కేడర్‌కు పోటీగా టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ-టీడీపీ వర్గీయుల వాగ్వాదం జరిగింది. పోలీసులు పరిస్థితి చేయదాటక ముందే ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.. దీంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్