
వైసీపీ ఎమ్మెల్యే:Pawan Kalyanకు ఆ పనిచేసే దమ్ముందా.. అందుకే లోకేష్‌ను కూడా
పవన్ చంద్రబాబు దుర్మార్గం చేస్తే ప్రశ్నించలేరని.. జగన్ మంచి చేసినా మెచ్చుకోలేరన్నారు. లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ను జనం రిజెక్టు చేశారన్నా
పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపాల్సిన ఖర్మ ప్రభుత్వానికి లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాంబాబు సినిమా టికెట్లపై ఒక పాలసీ తీసుకుని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఒక్కో సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో చెప్పాలన్నారు. రాజకీయ వారసత్వాలకే పవన్ వ్యతిరేకమా? సినిమా రంగానికి కాదా?. ప్రజలు, నిర్మాతలు కోరినందునే ఆన్ లైన్ టిక్కెట్లు పెట్టాం. కొందరి కోసం తాము పనిచేయడం లేదన్నారు.
పవన్ విశాఖ ఉక్కుపై పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని.. మిత్రపక్షాన్ని కేంద్రాన్ని నిలదీసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని గుర్తు చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ కేంద్రంతో పోరాడుతోందన్నారు. విశాఖ ఉక్కు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. గతంలో మోదీని తిట్టిన పవన్.. ఇప్పుడు పొగుడుతున్నారన్నారు. మోదీలో అప్పటికీ ఇప్పటికీ ఏం తేడా వచ్చిందన్నారు. Pawan Kalyan ఏ దీక్ష చేసినా జగన్, వైఎస్సార్‌సీపీ మీదే ఆరోపణలు చేస్తున్నారని.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమనే టార్గెట్ చేస్తున్నారన్నారు. పవన్‌కి ధైర్యం ఉంటే ప్లకార్డు పెట్టుకుని పార్లమెంటు ఎదుట పోరాటం చేయాలన్నారు.
14 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటి దాకా ఏం చేశారని ప్రశ్నించారు రాంబాబు. మంగళగిరి పక్కన రెండు ఎకరాలు గిఫ్టు కొట్టినందుకే అమరావతి రాజధాని కావాలని అడుగుతున్నారని సెటైర్లు పేల్చారు. పవన్ చంద్రబాబు దుర్మార్గం చేస్తే ప్రశ్నించలేరని.. జగన్ మంచి చేసినా మెచ్చుకోలేరన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్‌సీపీ అనేక వేదికల మీద పోరాటం చేసిందని.. లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ను జనం రిజెక్టు చేశారన్నారు. అందుకే ఎక్కడా గెలవలేకపోయారని.. అలాంటి వారు మాట్లాడితే జనం విశ్వసించరన్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్