janampulse
Breaking News

వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు…సీఎం జగన్ హత్యకు కుట్ర జరుగుతోంది

ముఖ్యమంత్రి జగన్‌ను చంపి అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తోంది. అందుకే చంద్రబాబు జగన్ గాల్లో కలిసిపోతారని వ్యాఖ్యానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ హత్యకు కుట్ర జరుగుతోందని.. ఆయన్ను చంపి అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తోంది. అందుకే చంద్రబాబు జగన్ గాల్లో కలిసిపోతారని వ్యాఖ్యానించారని.. మంత్రి కొడాలి నాని.. ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలను రూ.50లక్షలు ఇస్తానని కమ్మ సంఘం నేత మల్లాది వాసు వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. హింసా రాజకీయాలకు, స్కాంలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అన్నారు. టీడీపీ గౌరవ సభల పేరుతో డ్రామాలు ఆడుతోందని ఎమ్మెల్యే మండిపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు ఏదో జరిగిపోయిందని హడావిడి చేస్తున్నారని.. ఎవరి కోసం ఈ సభలు పెట్టారని ప్రశ్నించారు. టీడీపీ ఇలాంటి పనులు చేస్తే ప్రజలు తరిమికొడతారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.242 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో వేలకోట్ల ప్రజాధనం దోచుకున్నారన్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.